దేవాదాయ శాఖ కీలక నిర్ణయం.. బుధవారం నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా ప్రకటించిన మంత్రి

|

May 11, 2021 | 10:08 PM

బుధవారం నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో...

దేవాదాయ శాఖ కీలక నిర్ణయం.. బుధవారం నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా ప్రకటించిన మంత్రి
Yadadri
Follow us on

యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాల సమయంను నిర్ణయిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలావుంటే.. రేపటి నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో బుధవారం నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతరంగికంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి   నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:  Telangana Lockdown: తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన పోలీస్ శాఖ‌

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 20 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..