Tamilnadu: మధురై మీనాక్షి దేవస్థానం కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ వేసుకోకున్నా దర్శనం.. అక్కడ మాత్రం తప్పనిసరి!

|

Dec 13, 2021 | 11:20 AM

Tamilnadu: కరోనా మహమ్మారి రోజుకో రూపంతో మానవాళిని భయపెడుతున్న వేళ.. కోవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మనదేశంలో కఠినంగా..

Tamilnadu: మధురై మీనాక్షి దేవస్థానం కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ వేసుకోకున్నా దర్శనం.. అక్కడ మాత్రం తప్పనిసరి!
Meenakshi Amman Temple
Follow us on

Tamilnadu: కరోనా మహమ్మారి రోజుకో రూపంతో మానవాళిని భయపెడుతున్న వేళ.. కోవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మనదేశంలో కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ను కార్యక్రమాన్ని కూడా వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ప్రముఖ పుణ్య క్షేత్రం మధురైలో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్నవారికి మాత్రమే దర్శనం అన్న నిబంధనని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే..

మధురై లోని మీనాక్షి అమ్మన్ ఆలయ పరిపాలన సంస్థ డిసెంబర్ 13నుంచి కరోనా టీకాలు వేసుకున్న  వ్యక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని ఉత్తర్వులను జారే చేసింది. అయితే తాజాగా ఈ ప్రపాదనను తాము ఉపసంహరించుకుంటున్నామని ఆలయ నిర్వాహకులు శనివారం తెలిపారు.

అయితే ఇప్పటికే మదురైలో టీకాలు తీసుకొని వారిని దుకాణాలు, వ్యాపార సంస్థలు, సూపర్ మార్కెట్లు, థియేటర్లు, కళ్యాణ మండపాలు, షాపింగ్ మాల్స్, గార్మెంట్ షాపులు, బ్యాంకులు , మద్యం దుకాణాలతో సహా బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారిని సమీపంలోని కేంద్రాలకు పంపించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని నోటీసులో పేర్కొన్నారు.

కోవిడ్-19 వ్యాక్సిన్‌లో కనీసం ఒక డోస్‌ని అయినా ప్రజలు తీసుకోవాలని ప్రజలకు ఒక వారం సమయం ఇచ్చింది. అలా చేయని పక్షంలో హోటళ్లు, షాపింగ్ మాల్స్ , ఇతర వాణిజ్య సంస్థల వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అనుమతించమని జిల్లా కలెక్టర్ చెప్పారు. తమిళనాడులో ఇప్పటి వరకూ 7,46,84,956 కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read:  అంగ వైకల్యాన్ని జయించి పోల్ డ్యాన్సర్ గా గోల్డ్ మెడల్ సాధించిన యువతి