
కలలో కనిపించే ప్రతి విషయం ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ఏదో ఒక సూచనను ఇస్తుంది. కొంతమంది ఈ సూచనలను విస్మరిస్తారు.. అయితే ఈ కలలు కొన్నిసార్లు అదృష్టాన్ని తెలియజేస్తాయి.. మరికొన్ని రానున్న కష్టాలు, నష్టాలను తెలియజేస్తాయి. ప్రస్తుతం పితృ పక్షం జరుగుతోంది.. సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఈ సమయం పూర్వీకులకు అంకితం చేయబడింది. అలాంటి పరిస్థితిలో ప్రజలు పూర్వీకులకు సంబంధించిన అనేక రకాల కలలను చూస్తారు. కొంతమంది తమ కలలలో చనిపోయిన వ్యక్తి ఏడుస్తున్నట్లు చూస్తే.. మరికొన్ని సార్లు కలలో పూర్వీకులు ఆహారం తింటున్నట్లు కనిపిస్తారు. ఈ రోజు ఇలా పూర్వీకులు కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే ఆ కలకు అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
పూర్వీకులు కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం పూర్వీకులు కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే ఆ కల శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్ధం రానున్న కాలంలో పెద్ద విజయం, ఆర్థిక లాభం లేదా ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించవచ్చని అర్థం. అలాగే ఈ కల పూర్వీకుల ఆనందం, ఆశీర్వాదాలకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
ఆశీర్వాదం, విజయం: ఈ కల మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదించారని, మీ జీవితంలో విజయ కాలం ప్రారంభం కానుందని సూచిస్తుంది.
చెడిపోయిన పని పూర్తి : మీ పూర్వీకులు కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే.. మీకు సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది.
ఆనందం, సంతోషం: పూర్వీకులు మీ కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే.. వారు మీరు చేసిన మంచి పనులతో సంతోషంగా ఉన్నారని అర్థం.
కోరిక నెరవేరడం: ఈ కల పూర్వీకులు జీవితంలో కొంత మార్పు లేదా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారని సూచిస్తుంది.
పూర్వీకులతో కలిసి భోజనం చేయడం: మీరు మీ పూర్వీకులతో కలిసి కూర్చుని భోజనం చేస్తున్నట్లు కలలో కనిపిస్తే పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదించార, మీకు మంచి సమయం ప్రారంభమైందని సూచిస్తుంది.
పూర్వీకులు కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే ఏమి చేయాలి?
ఎవరికైనా కలలో తమ పూర్వీకులు ఆహారం తింటున్నట్లు కనిపిస్తే.. పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మలను లేదా తర్పణం ఇవ్వడం మంచిది. ఆ పూర్వీకుల పేరు మీద దానధర్మాలు చేయడం శుభప్రదం. ఇలా చేయడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.
చనిపోయిన తండ్రి కలలో ఆహారం తింటున్నట్లు కనిపిస్తే
మీ చనిపోయిన తండ్రి కలలో ఆహారం తింటున్నట్లు చూడటం చాలా మంచి సంకేతం. అంటే మీ పూర్వీకులు మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, వారి ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. అటువంటి పరిస్థితిలో, మీరు జీవితంలో విజయం సాధించవచ్చు, డబ్బు పొందవచ్చు. కోరిన కోరికలు నెరవేరుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు