Swapna Shastra: ప్రతి వ్యక్తి నిద్రలో కలలు కంటూ ఉంటాడు. ఆ కలలు భిన్నరకాలుగా ఉంటాయి. వస్తువులు, పాములు, కప్పలు. ఇలా అనేక విషయాలు కనిపిస్తుంటాయి. అయితే కలలో కనిపించే వస్తువులువేర్వేరు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పండ్లు కలలో కనిపించడం.. మనకు భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఇస్తున్నట్లు అని స్వప్న శాస్త్రం పేర్కొన్నది.
కలలు అనేవి మన జీవితంలో ఒక భాగం. కలలు మనపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. మనస్తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి రోజువారీ జీవితంలో లేదా అతని జీవితంలో ఏది చూసినా లేదా జరిగినా.. అవి కలలలో కనిపిస్తాయి. కలలలోని సంఘటనలు మిశ్రమంగా ఉంటాయి, కొన్ని కలలు జ్ఞాపకం ఉంటాయి. అయితే కొన్ని కలలను మెలకువ రాగానే మర్చిపోతారు. కొన్నిసార్లు కలలు పూర్తిగా అసంబద్ధమైనవి. కొన్ని చాలా భయానకంగా ఉంటాయి. చాలా సార్లు మనం కలలను విశ్లేషిస్తాము.. అవి మన నిజ జీవితంపై పెద్దగా ప్రభావం చూపవు.కలలో కొన్ని వస్తువులు కనిపించడం శుభ అశుభాలకు చిహ్నంగా పరిగణించబడుతుందని స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది. స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కల దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో జరిగే విషయాలు, సంఘటనల గురించి మనకు ముందుగానే సమాచారాన్ని అందిస్తుంది. కలలో కొన్ని పండ్ల కనిపిస్తే భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఇస్తున్నట్లట. ఈరోజు ఆ పండ్లు.. ఫలితాలను గురించి తెలుసుకుందాం.
నారింజ పండు.. .. ఇది పుల్లని పండు అయినప్పటికీ..స్వప్న శాస్త్రం ప్రకారం.. నారింజ పండు కలలో కనిపించడం శుభ సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉద్యోగంలో ఉన్నవారికి కమలాఫలం కలలోకి వస్తే.. వారు ప్రమోషన్ పొందడం ఖాయం. అంతే కాదు, అలాంటి వారికి గౌరవం కూడా లభిస్తుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో అరటిపండును చూడటం కూడా శ్రేయస్కరం. వివాహానికి ముందు ఎవరి కలలో నైనా అరటి పండు వస్తే.. వారి వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం మరింత పెరుగుతుందని నమ్మకం. భార్యాభర్తలు శుభవార్త వింటారు. కలలో అరటిపండును చూడటం ఒక రకమైన శుభ సంకేతం.
శాస్త్రాల ప్రకారం.. కొన్ని పండ్లు కలలో కనిపిస్తే, అవి భర్త-భార్య లేదా ప్రియుడు-ప్రేయసి మధ్య మాధుర్యాన్ని తీసుకుని వస్తాయి. వీటిలో జామ ఒకటి. మీరు జామపండును కలలో చూసినా.. మీరు దానిని తింటున్నట్లు కల కన్నా.. జీవితంలో చాలా మంచి జరుగుతుందని నమ్మకం.
కలలో ఆకుపచ్చని ద్రాక్ష పండ్లు కనిపిస్తే.. ఆరోగ్యంగా ఉంటారని అర్ధం.. అంతేకాదు అనారోగ్యంతో బాధపడేవారు.. త్వరగా కోలుకుంటారని అర్ధమట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)