Tirumala : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక మరో రెండు భాషల్లో.. కొత్తగా 16 టీటీడీ కళ్యాణ మండపాలు : టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

|

Jun 19, 2021 | 6:03 PM

స్వీబీసీ ఛానెల్ ని కన్నడ, హిందీ భాషల్లో రెండు నెలల్లో ప్రారంభిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల కొండపై అనుమతి లేకుండా నడిచే..

Tirumala : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక మరో రెండు భాషల్లో.. కొత్తగా 16 టీటీడీ కళ్యాణ మండపాలు : టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
Yv Subba Reddy
Follow us on

SVBC : ఎస్వీబీసీ ఛానెల్ ని కన్నడ, హిందీ భాషల్లో రెండు నెలల్లో ప్రారంభిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల కొండపై అనుమతి లేకుండా నడిచే షాపులన్నింటిని మూడురోజుల్లో తొలగించాలని నిర్ణయించామన్నారు. ఇటీవల ఆలయం ఎదుట ఉన్న షాపుల్లో అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం అయిన నేపథ్యంలో అక్రమ షాపులను తొలగిస్తున్నామని వివరణ ఇచ్చారు. కొండపై ఇప్పటికే ఉన్న షాపుల యజమానులు నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 16 టీటీడీ కొత్త కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. “ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్మస్థలం పై ఎలాంటి వివాదాలు వద్దు. రెండేళ్ల పాటు మా పాలకమండలి సేవలు అందించింది. ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి మనస్ఫూర్తిగా టిటిడి పాలకమండలి ధన్యవాదాలు తెలియజేస్తోంది.” అని టీటీడీ ఛైర్మన్ చెప్పుకొచ్చారు.

తిరుపతిలోని గరుడ వారధిని ఆలిపిరి వరకూ విస్తరిస్తామని.. కరోన ప్రభావం తగ్గిన నేపథ్యంలో తిరుమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Read also : Kodali Nani : నారా లోకేష్, చంద్రబాబుపై మళ్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీ మంత్రి కొడాలి నాని