సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం సూత కాలం 12 గంటలు లేదా 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం సూత కాలం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూత కాలం ఒక విధంగా అశుభ సమయంగా పరిగణించబడుతుంది. కనుక సూతకాల కాలంలో ఎటువంటి శుభకార్యాలూ, పూజలను చేయరు. .
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంటే
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, అరుబా, బెర్ముడా, కరేబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, కోస్టా రికా, క్యూబా, డొమినికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, జమైకా, నార్వే, పనామా, నికరాగ్వా, రష్యా, ప్యూర్టో రికో మార్టిన్ , స్పెయిన్, బహామాస్, యునైటెడ్ కింగ్‌డమ్, వెనిజులాతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
హిందూ మతంలో గ్రహణం సమయాని కంటే ముందు సూత కాలంగా పరిగణిస్తారు. ఈ సూత కాలం అశుభకరమైన కాలంగా పరిగణించబడుతుంది. సూతకాల కాలంలో భగవంతుడిని పూజించరు లేదా ఏ శుభకార్యమూ చేయరు. అంతేకాకుండా ఆలయాల తలుపులు కూడా మూసి వేస్తారు. అంతేకాదు సూత కాలంలో తినడం, త్రాగడం కూడా నిషేధించబడింది. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగిసినప్పుడు సూత కాలం కూడా ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు