2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈరోజు అంటే ఏప్రిల్ 20న ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం గ్రహణం ఉదయం 07:05 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. సైన్స్ దృక్కోణం నుండి.. ఇది ఖగోళ సంఘటన.. అయితే హిందూ మత విశ్వాసం ప్రకారం, సూర్యగ్రహణం అనేక జ్యోతిషశాస్త్ర ప్రభావాలను కలిగి ఉంటుంది. గ్రహణం ప్రభావాలు ఒక వ్యక్తి జాతకంలో శుభ ఫలితాలను ఇస్తే.. ఒకరి జాతకంలో అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. నేడు ఏర్పడనున్న గ్రహణం హైబ్రిడ్ సూర్యగ్రహణం అంతరిక్షంలో మరో అరుదైన అద్భుతం అని చెబ్తుఉన్నారు. అయితే ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలో కనిపించనున్న సూర్యగ్రహణంఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.
చైత్ర మాసం అమావాస్య రోజున మేష రాశి, అశ్విని నక్షత్రంలో ఏర్పడిన ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అని చెబుతున్నారు పండితులు. హిందూమతంలో, సూర్యగ్రహణాన్ని చూడటం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తిపై చెడు ప్రభావాలను చూపుతుందని విశ్వాసం. గ్రహణ సమయంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు పొందుతారు. సూర్యగ్రహణం ప్రాముఖ్యత ఏమిటి.. ఈ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..
సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)