జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

|

Jan 13, 2024 | 7:33 AM

15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఈ నెల 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి.

జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం
Tirumala
Follow us on

తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

జనవరి 14వ తేది ధనుర్మాస ఘడియలు పూర్తికానుండడంతో 15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఈ నెల 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..