Sunday Puja Tips: ఆదివారం పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయవద్దు.. సూర్యుడి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం..

హిందూ మతంలో ఆదివారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయనుడికి అంకితం చేయబడింది. కనుక ఆదివారం పూజ చేయడం కొన్ని నియమాలను పాటించడం వలన సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తీరతాయి, వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి నెలకొంటుంది. సంపద, అదృష్టం పెరుగుతాయి. అయితే పొరపాటున కూడా ఆదివారం కొన్ని పనులు చేయవద్దు..

Sunday Puja Tips: ఆదివారం పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయవద్దు.. సూర్యుడి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం..
Sunday Puja Tips

Updated on: Jun 08, 2025 | 6:31 AM

సనాతన ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడి, గ్రహానికి అంకితం చేయబడింది. ఆదివారం నవ గ్రహాలకు అధినేత సూర్యుడికి అంకితం చేబయబడిన రోజు. ఆదివారం సూర్య నారాయణుడికి చాలా ప్రియమైనది. కనుక ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి సూర్య దేవుడికి అర్ఘ్యం సమర్పించే భక్తులకు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. దీనితో పాటు, జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని నమ్మకం. అంతేకాదు , భక్తితో సూర్య భగవానుడిని పూజించేవారికి సూర్య భగవానుడి ఆశీస్సులు శాశ్వతంగా లభిస్తాయని నమ్ముతారు. కనుక ఆదివారం సెలవు దినం అంటూ బద్దకించకుండా ఉదయం లేచి స్నానం చేయండి. బెల్లం, కుంకుమ, ఎర్రటి పువ్వులు అక్షతలను నీటిలో వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అనంతరం సూర్యభగవానునికి సంబంధించిన వేద మంత్రాలను జపించండి. అనంతరం ఆచారాల ప్రకారం హారతిని ఇవ్వండి. ఇలా చేయడం వలన సూర్యుడు సంతోషిస్తాడు. అపారమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అయితే ఆదివారం రోజున సూర్యుడి అనుగ్రహం పొందాలంటే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయవద్దు..

ఆదివారం ఈ తప్పులు చేయవద్దు.

  1. ఈ రోజున నల్లని దుస్తులు ధరించకూడదు.
  2. ఈ రోజున ఉప్పు తినకుండా ఉండాలి.
  3. ఈ రోజున పొరపాటున కూడా తండ్రిని అవమానించకూడదని అంటారు.
  4. ఈ రోజున పొరపాటున కూడా ఏ స్త్రీతోనూ వాదించకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈ రోజున తులసి మొక్కను తాకవద్దు, నీరు సమర్పించవద్దు.

ఈ నియమాలను పాటిస్తూ.. సూర్యుడిని పుజిచడం ఫలవంతంగా ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. సమాజంలో మంచి స్థానం లభిస్తుంది.