Sunday Astro Tips: సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పించాలి? నియమాలు, పూజా విధానాన్ని తెలుసుకోండి..

|

Sep 10, 2023 | 8:54 AM

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని హృదయపూర్వకంగా పఠిస్తాడో, సూర్య దేవుడు అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. అంతేకాదు ప్రతి రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల కొత్త శక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలతో పాటు అదృష్టం, ఆరోగ్యం లభిస్తాయి.

Sunday Astro Tips: సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పించాలి? నియమాలు, పూజా విధానాన్ని తెలుసుకోండి..
Sunday Astro Tips
Follow us on

హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ప్రత్యక్ష దైవం.. గ్రహాలకు రాజుగా భావించే సూర్యభగవానుడికి రోజూ చేసే పూజలు ఉత్తమమైనవి.. అయితే ఆదివారం రోజున చేసే పూజ మరింత శుభఫలితాలను ఇస్తాయి. ఎవరైనా కొన్ని కారణాల వల్ల  రోజూ సూర్య భగవానుని పూజించలేకపోతే.. ఆదివారం నాడు పూజించడం వల్ల ఏడు రోజుల పాటు పూజించిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా చాలా ముఖ్యమైనది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని హృదయపూర్వకంగా పఠిస్తాడో, సూర్య దేవుడు అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. అంతేకాదు ప్రతి రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల కొత్త శక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలతో పాటు అదృష్టం, ఆరోగ్యం లభిస్తాయి. అయితే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి, సూర్య భగవానుని పూజించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి, సరైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

అర్ఘ్యం సమర్పించడానికి, పూజించడానికి కొన్ని నియమాలు

ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ముందుగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇందుకోసం రాగి పాత్రను తీసుకుని అందులో నీళ్లు నింపి అందులో కుంకుమ, అక్షతలు వేసి సూర్యభగవానుడికి సమర్పించాలి. ఈ సమయంలో ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. అర్ఘ్యం సమర్పిస్తున్న సమయంలో దృష్టిని నీటి ప్రవాహం వైపు ఉండాలి. నీటి ప్రవాహంలో సూర్యుని ప్రతిబింబం కనిపించేలా రెండు చేతులను పైకి లేపాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత, ఏడు ప్రదక్షిణలు చేసి సూర్య భగవానుడికి హారతిని ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

దీని తరువాత ఇంటిలోని పూజ గదిని పూర్తిగా శుభ్రం చేసి.. ఎరుపు రంగు వస్త్రంపై తూర్పు ముఖంగా కూర్చుని ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని కనీసం ఒక్క రోజా పఠించినా కోరిన కోరికలు నెరవేరతాయి. దీని తరువాత దీపం కూడా వెలిగించండి.

ఆదివారం జపించాల్సిన మంత్రాలను

మీరు ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించలేకపోతే.. కేవలం ఆదివారం నాడు అర్ఘ్యం సమర్పించి, ఈ క్రింది 12 మంత్రాలను పఠిస్తే, ప్రతిరోజూ పాటించిన ఫలం లభిస్తుంది. 12 మంత్రాలు: ఓం సూర్యాయ నమః, ఓం భాస్కర నమః, ఓం రామాయ నమః, ఓం మిత్ర నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్య నమః, ఓం సవిత్రే నమః, ఓం సవిత్రే నమః ఓం హిరణ్యగర్భాయ నమః

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)