Success Mantra: పొగడ్తల్లో దాగున్న అబద్ధాన్ని..  విమర్శలో దాగున్న నిజాన్ని తెలుసుకున్న వ్యక్తి జీవితంలో సక్సెస్ ఫుల్ పర్సన్

ప్రశంసలు ఎవరికి అవసరం అనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అంతెందుకు మనం ఎవరిని పొగడాలి? జీవితంలో ఒక వ్యక్తికి ప్రశంసలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒక వ్యక్తిని ఎప్పుడు, ఎలా ప్రశంసించాలి? ఎవరైనా మనల్ని పొగడినప్పుడు మనం ఎలా స్పందించాలి?

Success Mantra: పొగడ్తల్లో దాగున్న అబద్ధాన్ని..  విమర్శలో దాగున్న నిజాన్ని తెలుసుకున్న వ్యక్తి జీవితంలో సక్సెస్ ఫుల్ పర్సన్
Praise Quotes

Updated on: Jan 19, 2023 | 6:14 PM

జీవితంలో పొగడ్తలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు చెప్పండి. అందరూ తమని పది మంది మెచ్చుకోవాలని కోరుకుంటారు. దీని కోసం.. కొంతమంది మంచి పనులు చేస్తారు.. మరికొందరు తమ చుట్టూ తమని పొగిడేందుకు కొంతమందిని చేరదీస్తారు. తమని వీరు ఎల్లప్పుడూ ప్రశంసించే విధంగా తయారు చేస్తారు. అయితే ప్రశంసలు ఎవరికి అవసరం అనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అంతెందుకు మనం ఎవరిని పొగడాలి? జీవితంలో ఒక వ్యక్తికి ప్రశంసలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒక వ్యక్తిని ఎప్పుడు, ఎలా ప్రశంసించాలి? ఎవరైనా మనల్ని పొగడినప్పుడు మనం ఎలా స్పందించాలి? మానవునికి ప్రశంసలు ఎంత ప్రయోజనకరం?

ఇవి కొన్ని అటువంటి ప్రశ్నలు తరచుగా తలెత్తుతాయి. వీటి సమాధానాలను అందరూ తెలుసుకోవాలని కోరుకుంటారు. ఉదాహరణకు, ఇతరులు మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రశంసించాలని మీరు కోరుకుంటే, ముందుగా మీరు ఏదైనా మంచి పనిని ప్రారంభించాలి. ప్రశంసల గురించి.. కొందరు పూజ్యనీయులు చెప్పిన ప్రకారం.. మంచి పనిని ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు.. అయితే మంచి వ్యక్తులు ఆ ప్రశంసలను వినయంగా స్వీకరిస్తారు. ఈ రోజు ప్రశంసలు ఇచ్చే బలం గురించి తెలుసుకుందాం..

  1. సరైన ప్రశంసలు  అందుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప ప్రోత్సహాన్ని ఇస్తాయి. అయితే తప్పుడు ప్రశంసలు అదే మనిషిని  అజాగ్రత్తపరునిగా, బలహీనంగా చేస్తుంది.
  2. ఏ వ్యక్తి అయినా ఎల్లప్పుడూ పొగడ్తలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అతి ప్రశంసలు అతని వ్యక్తిత్వంలోని మంచితనాన్నిమాయం అయ్యేలా చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ప్రశంసలను తెలివైన వ్యక్తి  వినయంగా స్వీకరిస్తాడు. అదే ప్రశంసలు మూర్ఖుడిని గర్విగా తయారు చేస్తుంది. అంతేకాదు బలహీనమైన మనస్సును గర్వం అనే మత్తులో పడేస్తాయి.
  5. పొగడ్తల్లో దాగివున్న అబద్ధాన్ని..  విమర్శలో దాగున్న నిజాన్ని ఎవరు తెలుసుకుని అర్థం చేసుకుంటారో.. అతను తన జీవితాన్ని గుర్తించాడని అర్థం చేసుకోవాలి.
  6. ఒకరి లక్షణాలను ప్రశంసించడంలో మీ విలువైన సమయాన్ని ఎప్పుడూ వృథా చేయకండి. బదులుగా అతని/ఆమె లక్షణాలను అలవర్చుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)