Subramanian Swamy : కాంట్రవర్సీ ఎంపీ మరో సంచలనానికి తెరదీశారు. దీంతో టెంపుల్స్ ఫ్రీడంపై మళ్లీ రచ్చ మొదలైంది. ఆలయాల స్వతంత్రత అంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఓ కేసు విషయమై అమరావతి వచ్చిన బీజేపీ నేత హాట్ డిబేట్‌కు తెరలేపారు. ‘టెంపుల్స్ ఫండ్స్ పక్కదారి పట్టొద్దు.. ఆలయాల స్వతంత్రతపై ఎవరూ స్పందించరేం..? టెంపుల్స్‌తో బిజినెస్ చేస్తారా..? అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఆలయాలపై ప్రభుత్వాల ఆధిపత్యమా అంటూ నిలదీశారు బీజేపీ నేత.
తిరుమల ఫండ్స్‌పై గతంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించిందన్నారు సుబ్రమణ్యస్వామి. తిరుమల అకౌంట్స్‌ను ప్రభుత్వం కాకుండా CIG ద్వారా లెక్కించాలన్నది ఆ తీర్పు సారాంశమన్నారు. ఇందుకు జగన్ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. ఆలయాలకు వచ్చే ఫండ్ ప్రజలది.. ఆ నిధుల్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఎలా వాడతారంటూ ప్రశ్నించారు బీజేపీ నేత. విరాళాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతర కార్యక్రమాలకు ఉపయోగించొద్దని.. ఆలయాల అవసరాలు, అభివృద్ధికే వాడాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాల ఆధీనంలో 4 లక్షల ఆలయాలున్నాయన్నారు. ఆలయాల మాదిరి చర్చిలు, మసీదులపై ఎక్కడా ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు సుబ్రమణ్యస్వామి. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, ఇప్పటికే ఏపీలో ఆలయాల విధ్వంసంపై తీవ్ర రచ్చ నడుస్తోంది. ఆలయాలకు భద్రత కరువైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొన్నటిదాకా ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఈ క్రమంలో ఏపీ కేంద్రంగా సుబ్రమణ్యస్వామి కామెంట్స్ చర్చకు తెరదీశాయి. ఆలయాలకు స్వేచ్ఛ ఉండాల్సిందేనంటూ టెంపుల్స్ ప్రస్తావన తీసుకురావడం అగ్గిరాజేస్తోంది.
Read also :