Statue of Equality: ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. సహస్రాబ్ది సమారోహం లో ముడవరోజు అష్టాక్షరి మహామంత్ర జపం తో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది. మహా యాగంలో ఈరోజు ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్మీ నారాయణేష్టి,వైనతేయేష్టి ఆరాధన జరుగనున్నాయి. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 6 గంటల 30నిమిషాలకు ప్రారంభమైన అష్టాక్షరీ మహామంత్ర జపం 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హోమాలు ప్రారంభించారు. ఆ తర్వాత 10 గంటల 30నిమిషాలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
సాయంత్రం 5 గంటలకు మరోసారు హోమాలు చేస్తారు. ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక భవిష్యత్తులో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు యావత్ దేశానికే గర్వకారణమన్నారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. గంట మండపంలో భారీ గంటను మోగించారు.
మూడవ రోజు జరిగే కార్యక్రమాల వివరాలు ఇలా..
– శుక్రవారం ఉదయం 06.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అష్టాక్షరీ మహామంత్ర జపం.
– 8.30 గంటలకు హోమాలు.
– 10.30 గంటలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీ కృష్ణమాచార్య ప్రవచనాలు
– మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.
– సాయంత్రం 5 గంటలకు హోమాలు.
– శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టి.
– లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.
శనివారం ఉదయం 6గంటలకు మంత్ర అనుష్టానం ఉంటుందని యాగ నిర్వాహకులు తెలిపారు. మన చుట్టూ ఉన్న సమాజ క్షేమానికి, వాతావరణ కాలుష్య నివారణకు, జీవరాశుల్లో శ్రద్ధను కలిగించడానికి మంత్రం అనుష్టానం చేయాలన్నారు. 14 వ తేది వరకు ప్రతి రోజు ఉదయం మంత్రం అనుష్టానం ఉంటుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: Hero Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న మహేశ్ మేనల్లుడి సినిమా.. స్ర్టీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..