తిరుమల …రికార్డుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. నిన్న రూ.6.31 కోట్ల కానుకలు శ్రీవారికి హుండీ ద్వారా సమర్పించిన భక్తులం.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. TBC వరకు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,565 ..
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులున కోనేటిరాయుడికి భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఆదివారం ఒక్కరోజే 6 కోట్ల 31 లక్షల రూపాయల మేర ఆదాయం హుండీ ద్వారా లభించింది.
కరోనా ఆంక్షలు పూర్తి స్తాయిలో తొలగించిన అనంతరం.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రోజూ సుమారు 75 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. TBC వరకు క్యూలైన్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.
ఆదివారం 80,565 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని.. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..