Tirumala Brahmotsavalu: కల్పవృక్షంపై కోరికలు తీర్చే కొండంత దేవుడు.. అశేష భక్తజన సందోహం మధ్య ఘనంగా ఉత్సవాలు

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలు ఇవాళ్టికి ( శుక్రవారం ) నాలుగో రోజుకు చేరాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారు కల్పవృక్ష వాహనం పై ఊరేగుతున్నారు..

Tirumala Brahmotsavalu: కల్పవృక్షంపై కోరికలు తీర్చే కొండంత దేవుడు.. అశేష భక్తజన సందోహం మధ్య ఘనంగా ఉత్సవాలు
Kalpa Vruksha Vahana Seva

Updated on: Sep 30, 2022 | 8:54 AM

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలు ఇవాళ్టికి ( శుక్రవారం ) నాలుగో రోజుకు చేరాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారు కల్పవృక్ష వాహనం పై ఊరేగుతున్నారు. అశేష భక్తజన సందోహం మధ్య.. వైకుంఠ నాథుడు తిరుమాడ వీధుల్లోని భక్తులకు అభయం ఇస్తున్నాడు. కోరిన కోర్కెలు నెరవేర్చేదిగా కల్పవృక్షానికి పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే కోరిక కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. గురువారం ఉదయం 10 గంటలకు వచ్చిన భక్తులకు త్వరగానే దర్శన భాగ్యం దక్కింది. గంటలోనే స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రద్దీ పెరిగింది. శనివారం గరుడ వాహనసేవ నేపథ్యంలో తమిళనాడు నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బ్రహ్మోత్సవాల రద్దీ ఇకపై పెరిగే అవకాశం ఉంది. బుధవారం శ్రీవారి హుండీకి రూ.3.03 కోట్లు కానుకలు వచ్చాయి.

కాగా.. శ్రీ వేంకటేశ్వర స్వామివారు గురువారం సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి గంటల నుంచి 10 గంటల వరకు తిరుమాడ వీధుల్లో విహరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సింహంపై ఊరేగారు. రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై రుక్మిణి, సత్యభామ సమేతంగా వేణుగోపాలస్వామి అలంకరణలో దర్శనమిచ్చారు. మరోవైపు.. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక కల్యాణ వేదికలో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన సెట్టింగ్‌ల వద్దకు చేరుకుని సెల్ఫీలు దిగుతూ తమ సెల్‌ఫోన్లలో జ్ఞాపకాలను భద్రపరుచుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి ఎనిమిది గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..