ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి, ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి, నిర్వహించి నాగవల్లి కార్యక్రమంలో శివరాత్రి పర్వదినం రోజున కల్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం ప్రకారం మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ నిర్వహించారు. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటి రోజున మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసి దేవస్థానం అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు ధ్వజపటాన్ని కిందకు దించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపు జరిగే అశ్వవాహనం పుష్పోత్సవం, శయణోత్సవం,శ్రీస్వామి అమ్మవారి ఏకాంతసేవతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..