Srisailam: శ్రీశైలంలో శివరాత్రి శోభ.. నేటినుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు..

Srisailam Temple: ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలంలోని ప్రముఖ శైవ క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి (Mallikarjuna Temple) ఆలయంలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలంలో శివరాత్రి శోభ.. నేటినుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు..
Srisailam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 22, 2022 | 10:48 AM

Srisailam Temple: ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలంలోని ప్రముఖ శైవ క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి (Mallikarjuna Temple) ఆలయంలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల (Srisailam Maha Shivaratri Brahmotsavam) సందర్భంగా మొదటిసారి స్వామి వార్లకు పట్టువస్త్రాలు శ్రీకాళహస్తి దేవస్థానం సమర్పించనుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి నుండి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం లభించనుంది. మార్చి 5 నుంచి సర్వ దర్శనాలు పునప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరించనున్నారు.

కాగా.. మహాశివరాత్రికి, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు ఆన్‌లైన్లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో లవన్న సూచించారు. శీఘ్రదర్శనం రూ. 200, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజులు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

రేపటినుంచి స్వామి అమ్మవార్లకు వాహ‌న సేవ‌లు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

Also Read:

Guntur District: రామాలయం పునరుద్దరణ పనుల్లో తప్పిన పెను ప్రమాదం.. విరిగిపడిన భారీ రాతి ధ్వజ స్థంభం.. ఎక్కడంటే..

IRCTC: తక్కువ ధరతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే..

ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే..డబ్బే డబ్బు
ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే..డబ్బే డబ్బు
చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? కారణం ఏంటి..
చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? కారణం ఏంటి..
ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌
ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌
ఎగుమతుల్లో మారుతీ సుజుకీ నయా రికార్డ్..!
ఎగుమతుల్లో మారుతీ సుజుకీ నయా రికార్డ్..!
గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే ..
గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే ..
ఈ ఆహారాలు తీసుకున్నారంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే!
ఈ ఆహారాలు తీసుకున్నారంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే!
బంపర్‌ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు.. వామ్మో జర జాగ్రత్త..
బంపర్‌ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు.. వామ్మో జర జాగ్రత్త..
రాకింగ్ స్టార్ యష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..
రాకింగ్ స్టార్ యష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..
రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌.. రేసులో ఉన్నది ఎవరో తెలుసా..?
రాజ్యసభ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌.. రేసులో ఉన్నది ఎవరో తెలుసా..?
మలయాళ ఇండస్ట్రీ కాదు.. మాయల ఇండస్ట్రీ అది..!
మలయాళ ఇండస్ట్రీ కాదు.. మాయల ఇండస్ట్రీ అది..!