Bhishma Ekadasi 2021: ఇంద్రకీలాద్రి పై చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి వేడుకలు.. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

|

Feb 23, 2021 | 1:13 PM

విజయవాడ విజయకీలాద్రిపై భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం..

Bhishma Ekadasi 2021: ఇంద్రకీలాద్రి పై చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి వేడుకలు.. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
Follow us on

Bhishma Ekadasi 2021: విజయవాడ విజయకీలాద్రిపై భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం విరాట్ పారాయణo చిన్న జీయర్ స్వామి బాసన చేశారు. విష్ణు సహస్రనామ పారాయణం వినేందుకు భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని విజయ కీలాద్రి వెంకటేశ్వర స్వామికి చిన జీయర్ స్వామి పూజలు నిర్వహించి.. ప్రత్యేక హారతులిచ్చారు. విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణం ప్రారంభించారు. ఈ పారాయణం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగనుంది. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినందునే బిష్ముడు పేరు చరిత్రలో నిలిచిపోయిందని.. ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించిన వారి జన్మ చరితార్ధమవుతుందని చెప్పారు.

Also Read:

 లక్ష్మి నరసింహ స్వామివారి క్షేత్రంలో రక్తంతో ప్రవహించిన నది, ఎక్కడో తెలుసా..?

సముద్రం ఆ క్షేత్రంలోకి రాకుండా.. సంకెళ్లతో కాపలా కాస్తున్న ఆంజనేయస్వామి ఎక్కడో తెలుసా..!