Sri Ramanavami: శ్రీ రామ నవమి పూజ తర్వాత వీటిని దానం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి..

|

Apr 17, 2024 | 2:33 PM

హిందూ సంస్కృతిలో రామ నవమి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున ప్రత్యేక పూజలు, చేసే దానాలు వలన శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని పూజించడం వల్ల ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి. శ్రీ రామ నవమి నాడు రాముడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా రామరక్షాస్త్రాన్ని పఠించండి. రామ మంత్రం, హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరా కాండ మొదలైనవాటిని పఠించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభించడమే కాదు.. సంపద నిరంతరం పెరుగుతుంది.

Sri Ramanavami: శ్రీ రామ నవమి పూజ తర్వాత వీటిని దానం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి..
Srirama Navami Puja
Follow us on

హిందూ మతంలో శ్రీ రామ నవమి సందర్భంగా  ఇచ్చే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఆపన్నులకు అండగా నిలిచి అవసరం తీర్చడమే అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకనే పండగలు, పర్వదినాలు, ముఖ్యమైన రోజుల్లో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి దానధర్మాలుగా ఎన్నో వస్తువులు అందజేస్తారు. సనాతన ధర్మంలో విశ్వాసాల ప్రకారం పొరపాటున కూడా దానం ఇవ్వకూడని వస్తువులు అనేకం ఉన్నాయి. హిందూ సంస్కృతిలో రామ నవమి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున ప్రత్యేక పూజలు, చేసే దానాలు వలన శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని పూజించడం వల్ల ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి.

శ్రీ రామ నవమి నాడు రాముడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా రామరక్షాస్త్రాన్ని పఠించండి. రామ మంత్రం, హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరా కాండ మొదలైనవాటిని పఠించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభించడమే కాదు.. సంపద నిరంతరం పెరుగుతుంది. శ్రీ రామ నవమి రోజున దుర్గదేవిని, కన్య పూజ చేసిన తర్వాత దానం చేయండి.

ఏది దానం చేయాలో.. ఏది దానం చేయకూడదో తెలుసా?

ధనవంతుడు ఎప్పుడూ గొప్ప కోసం దానం చేయరాదు. అవతలి వారి అవసరం బట్టి చేసే దానం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ఎవరైనా పాత్రలను దానం చేయాలనుకుంటే అవసరమైన వ్యక్తికి మాత్రమే దానం చేయండి.. తద్వారా వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

ఇవి కూడా చదవండి

శ్రీ రామ నవమి రోజున పేదలకు, నిస్సహాయులకు దానం చేయడం.. ఆహారం అందించడం శుభ ప్రదం.

శ్రీ రామ నవమి రోజున పెద్దల ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి.

శ్రీ రామ నవమి రోజున సమీపంలోని రామాలయానికి వెళ్లి పం వెలిగించి, ప్రసాదం సమర్పించి, పూజ తర్వాత, వీలైనంత ఎక్కువ మందికి ప్రసాదాన్ని పంచండి.

నవమి రోజున పెళ్లికాని ఆడపిల్లలకు ఆహారాన్ని అందించండి. దీంతో దుర్గామాత సంతోషించి ప్రజలను అనుగ్రహిస్తుంది.

మతం పట్ల ఆసక్తి లేని వ్యక్తికి ఎప్పుడూ మతపరమైన పుస్తకాలను దానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభించదు.

హిందూ మతంలో అన్నదానం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఆకలితో లేదా పేదవాడికి ఆహారం అందిస్తే దేవుడు సంతోషిస్తాడు. అయితే ఎప్పుడూ చెడిపోయిన లేదా నిల్వ ఆహారాన్ని మాత్రం దానం ఇవ్వరాదు. ఇలా చేయడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే.

ఈ ప్రత్యేక చర్యలు చేయండి

జీవితంలో ఐశ్వర్యం కలగాలంటే రామ నవమి రోజున గుడిలో కుంకుమను అందించండి.

పాలలో కుంకుమ పువ్వు వేసి స్వామికి అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయని జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని చెబుతారు.

అంతేకాదు శ్రీ రామ నవమి రోజున శక్తి కొద్దీ పేదలకు బట్టలు , ఆహారాన్ని దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు