Pothuraju Swamy: పార్వతి తనయుడు పోతురాజు జాతర.. కాల్చిన శూలాన్ని పొట్టకి తాకించుకుంటే కోర్కెలు తీరతాయని విశ్వాసం..

|

Feb 25, 2023 | 8:55 AM

అనకాపల్లి జిల్లాలోని ఆలయం. ఈ సీజన్లో అక్కడ సందడే సందడి. శివరాత్రి సీజన్లో రద్దీ అమాంతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ దీపం దగ్గర ఉన్న సూలాన్ని తాకించుకునేందుకు పోటీ పడతారు భక్తులు. పెళ్లి కాని వారు... సంతానం కలగని వారే అక్కడ ఎక్కువ మంది భక్తులు. ఏమిటా మహిమ..? ఎక్కడ ఉంది ఆ ఆలయం..?

Pothuraju Swamy: పార్వతి తనయుడు పోతురాజు జాతర.. కాల్చిన శూలాన్ని పొట్టకి తాకించుకుంటే కోర్కెలు తీరతాయని విశ్వాసం..
Poturaju Temple
Follow us on

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కల్యాణ లోవ గ్రామంలో గల రెజర్వాయిర్ దగ్గర పదహారు వండల ఏళ్ల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే వారట. ఆ కాలంలో కళ్యాణ లోవ కొండపై జాలువారిన పరమశివుని కన్నీటి చుక్కతో ఏర్పడినటువంటి ఆలయమే ఈ పోతురాజు స్వామి ఆలయం అని పూర్వీకులు చెబుతున్నారు. అదే ఈరోజు కళ్యాణ లోవ గా ప్రసిద్ధి చెందింది. పోతురాజు స్వామికి ఏడుగురు అక్క చెల్లెలు వున్నారు. వాళ్లంతా వేరువేరు చోట్ల గ్రామదేవతలుగా కరుణాకటాక్షాలతో ఆశీర్వదిస్తారని అక్కడి వారి నమ్మకం. భూలోకమ్మ తల్లి, కళ్యాణ లోవ పెద్దింటి అమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, అనకాపల్లి నూకాలమ్మ, తల్లి పాడేరు మోదకొండమ్మ తల్లి, ఒడిశా మజ్జిగరమ్మ తల్లి, మరిడిమాంబ తల్లి దేవతలకు .. పోతురాజు స్వామి సోదరుడు గా ఉంటారు. పోతురాజు స్వామి లోకంలో గల చెడును అంతం చేసి ఈ లోకాన్ని రక్షించే భాద్యతనీ తీసుకుంటాడట.

మేక పోతులను, కోళ్లను బలి దానం చెయ్యడం ద్వారా పోతురాజు స్వామిని శాంతి, తృప్తిని కలుగుతుందిని దేవతలు అయిన అక్కచెల్లుళ్ళు చెప్తారు అని పురాణ చరిత్ర.. అలా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు సమయంలో ఏడుగురు అక్క చెల్లెళ్ళు తొమ్మిది రోజుల శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ వుంటారు. శివరాత్రి అనంతరం దేవతలు అయిన అక్కచెల్లుళ్ళను పోతురాజు స్వామి పసుపు కుంకమతో సాగనంపుతాడాని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అయితే.. పోతురాజు స్వామిని భక్తులు ఎంతగా మొక్కుకుంటారో… ఆలయం పక్కనే కొలువైయున్న పెద్దమ్మ తల్లిని కూడా అంతే ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ వారం రోజుల ఉత్సవాల్లో… పెద్దమ్మ తల్లి గుడికి భారీగా క్యూ కడుతుంటారు జనం. వారిలో పెళ్ళికాని వారు సంతానం లేని వారే అధికంగా ఉంటారు. అమ్మవారిని దర్శించుకుని ఒక్కసారి ఆ శూలాన్ని తాకించుకుంటే.. కచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే.. పెద్దమ్మ తల్లి కి మొక్కి ఆ తల్లి దగ్గర దీప వెలుగులో చిన్న శూలం గుర్తు గల ఇనుప పట్టిని కాల్చి భక్తుల పొట్ట క్రీంద భాగం, నడుము కింద భాగాన శూలం గుర్తులు వేస్తారు. దానికోసం భక్తులు తాకిడి భారీగా ఉంటుంది. స్థానికంగా కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి ఎక్కడికి తరలి వస్తుంటారు జనం. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మొక్కులు తీరుతాయి అన్నది అపార నమ్మకం. వచ్చే ఏడాదికి వివాహం కాని, సంతానం కానీ పెద్దమ్మ తల్లి అనుగ్రహం వలన కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఇది.. పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర. అమ్మవారి కరుణాకటాక్షాలు. అమ్మవారిపై భక్తుల నమ్మకమే దేవునిగా నడుపుతోందనడంలో వాళ్ల విశ్వాసమే చెబుతోంది.

ఇవి కూడా చదవండి

Reporter : Khaja

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..