Janmashtami 2024: జన్మాష్టమి రోజున బాల గోపాలుడికి ఈ వస్తువులు నైవేద్యంగా సమర్పించండి.. కన్నయ్య అనుగ్రహం మీ సొంతం..

|

Aug 25, 2024 | 6:31 AM

ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడికి రకరకాల రుచికరమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు. సమర్పించబడిన కొన్ని వస్తువులు శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన వస్తువులను సమర్పించడం ద్వారా సాధకుడు శ్రీకృష్ణుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతాడని, జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. లడ్డూ గోపాల్‌కి నైవేద్యంగా ఏయే వస్తువులు పెడితే శుభప్రదంగా, ప్రయోజనకరంగా భావిస్తారో తెలుసుకుందాం..

Janmashtami 2024: జన్మాష్టమి రోజున బాల గోపాలుడికి ఈ వస్తువులు నైవేద్యంగా సమర్పించండి.. కన్నయ్య అనుగ్రహం మీ సొంతం..
Janmashtami 2024
Follow us on

ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీ కృష్ణ భగవానుడు ఈ తిధిన జన్మించాడని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ తిధిని శ్రీ కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున లడ్డూ గోపాలుని ప్రత్యేక పూజలు, శ్రీకృష్ణుని బాల రూపానికి అలంకారం చేసి పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని జన్మకు ఉన్న అర్ధాన్ని పరమార్ధాన్ని గుర్తు చేసుకుంటారు. భక్తులు వివిధ రకాల మిఠాయిలను ఇంట్లో తయారు చేసి వాటిని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేడంగా పెట్టి వాటిని ఆకలి అన్నవారికి వితరణ చేయడం కూడా విశేషమైన విశిష్టతగా పరిగణించబడుతుంది. ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడికి రకరకాల రుచికరమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు. సమర్పించబడిన కొన్ని వస్తువులు శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన వస్తువులను సమర్పించడం ద్వారా సాధకుడు శ్రీకృష్ణుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతాడని, జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. లడ్డూ గోపాల్‌కి నైవేద్యంగా ఏయే వస్తువులు పెడితే శుభప్రదంగా, ప్రయోజనకరంగా భావిస్తారో తెలుసుకుందాం..

లడ్డూ గోపాల్‌కి ఈ వస్తువులను సమర్పించండి

అటుకులు, మిశ్రి శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనదిగా పరిగణించబడుతున్నాయి. కావున జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విశేష ఆశీస్సులు పొందాలంటే ఖచ్చితంగా ఆయనకు అటుకులు, మిశ్రిలను సమర్పించండి.

ఇవి కూడా చదవండి

కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు. ఇలా వెన్నను నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.

చరణామృతం శ్రీకృష్ణుడికి చాలా ముఖ్యమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. శ్రీకృష్ణుడి నైవేద్యంలో చరణామృతం లేకపోతే శ్రీ కృష్ణుడికి పెట్టే నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కనుక జన్మాష్టమి శుభ సందర్భంగా లడ్డూ గోపాల్‌కు చరణామృతాన్ని సమర్పించడం మర్చిపోవద్దు.

మఖానా, డ్రై ఫ్రూట్స్ ఖీర్ అందించడం కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. కనుక శ్రీ కృష్ణుడి ఆశీర్వాదం పొందడానికి అతనికి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్‌తో ఖీర్ అందించండి.

తామర గింజలతో చేసిన మిఠాయి చాలా రుచికరమైన స్వీట్. ఈ ఆహారం ఉపవాసం ఉన్నవారికి మంచిదిగా పరిగణిస్తారు. ఇది శ్రీకృష్ణునికి సమర్పించడం వలన శుభం కలుగుతుందని విశ్వాసం. అందుకే ఈ జన్మాష్టమి రోజున బాల గోపాలుడికి నైవేద్యంలో ఖచ్చితంగా మఖానా మిఠాయి లేదా లడ్డూ చేర్చండి.

జన్మాష్టమి రోజున లడ్డూ గోపాల్‌కి భోజనం పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి

जन्माष्टमी के दिन लड्डू गोपाल को भोग अर्पित करते समय इस मंत्र का जप करना चाहिए.

మంత్రం యొక్క అర్థం: ఓ ప్రభూ నా వద్ద ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే.. దానిని మేము మీకు అందిస్తున్నాము. దయచేసి ఈ సమర్పణను అంగీకరించండి.

జన్మాష్టమి 2024 పూజకు అనుకూలమైన సమయం (జన్మాష్టమి 2024 శుభ ముహూర్తం)

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 25, 2024 ఆదివారం మధ్యాహ్నం 3:39 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇది మరుసటి రోజు ఆగస్టు 26, 2024 సోమవారం మధ్యాహ్నం 2:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆగస్టు 26వ తేదీ సోమవారం జన్మాష్టమి జరుపుకుంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు