హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం తో పాటు.. శివయ్యను కూడా పూజిస్తారు. శివయ్య భక్తులు అన్ని నియమ, నిబంధనలతో ఆయనను పూజిస్తారు. పురాణాల ప్రకారం శ్రావణ సోమవారం నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా ఫలవంతమైనది. ఈ రోజున మహాదేవుడిని పూజించే భక్తుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడని చెబుతారు. కనుక సోమవారం ఉపవాసం గురించి.. శ్రావణ సోమవారానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం దేవదేవుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం ఈ నెలలో అమృతం కోసం సముద్ర మథనం జరిగిందని నమ్ముతారు. ఈ క్రమంలో శివయ్య విషం తాగాడు. హాలాహల సేవించిన శివయ్యకు శాంతిని కలిగించడానికి భక్తులు జలాన్ని సమర్పిస్తారు. కనుక ఈ నెలలో శివయ్యను పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని విశ్వాసం.
శ్రావణ సోమవారం మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే?
శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలతో పాటు మహాదేవుడిని పూజిస్తారు. కనుక ఇద్దరు దేవుళ్ల ఆశీస్సులు భక్తులపై కురుస్తాయని నమ్ముతారు. సనాతన సంప్రదాయం ప్రకారం ఎవరికైనా వివాహంలో ఆటంకాలు ఏర్పడితే, ఆ వ్యక్తి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల వివాహ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి.
అనేకాదు ఎవరి ఇంట్లోనైనా ఆర్ధిక ఇబ్బందులు ఉంటే.. సోమవారం నాడు శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించండి. అంతేకాదు శివాలయంలో జమ్మి మొక్కను ఇవ్వండి. శివునికి పూజ చేసిన జమ్మి ఆకులను ఇంటి సేఫ్ లాకర్‌లో ఉంచండి. ఈ పరిహారం చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
పూజా విధానం
హిందూ విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించండి. అంతేకాదు పాలుతో అభిషేకం చేయండి. దీనితో పాటు ప్రతిరోజూ శివ మంత్రాన్ని పఠించండి. ఉపవాస దీక్ష ఉండి.. అల్పాహారం లేదా పండ్లు తీసుకోవాలి. రుద్రాక్షను ధరించాలనుకుంటే, ఈ నెల ఉత్తమమైనది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)