Solar Eclipse: మంగళవారం సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, సమయంలో ఏర్పడనున్నదంటే..

ఈ గ్రహణ ప్రభావం భారత దేశంలో అండమాన్-నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉండనున్నదని.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదని చెబుతున్నారు.

Solar Eclipse: మంగళవారం సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, సమయంలో ఏర్పడనున్నదంటే..
Solar Eclipse 2022

Updated on: Oct 23, 2022 | 12:06 PM

ఈ ఏడాది ఆశ్వయుజ అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది. నేడు, రేపు అమావాస్య తిథి ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి సూర్యగ్రహం అక్టోబర్ 25వ తేదీ దీపావళి రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం పాక్షికంగా ఏర్పడనున్నదని..  ప్రపంచంలో అనేక దేశాలపై ఈ గ్రహణ ప్రభావం చూపించనున్నదని చెబుతున్నారు. ఈ పాక్షిక సూర్యగ్రహణం  యురేపియన్ కంట్రీస్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలతో సహా మనదేశంలో కూడా కనిపిస్తుంది.

సూర్యగ్రహం అంటే ఏమిటంటే:

చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యకు వచ్చి.. ఆ సమయంలో సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుంటుంది. అప్పుడు భూమి మీద కొంత కొన్ని భాగాల్లో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడడు. సూర్యగ్రహణం ఖగోళ సంబంధమైన సంఘటన అయినప్పటికీ, భారతీయ సంస్కృతిలో గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఇవి కూడా చదవండి

సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. రేపు ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణమేనని.. సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 5.42 గంటలకు ముగియనుందని చెబుతున్నారు. దాదాపు 1.15 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం ఉండనుంది.

ఈ గ్రహణ ప్రభావం భారత దేశంలో అండమాన్-నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉండనున్నదని.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదని చెబుతున్నారు. దీపావళి రోజున ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణాన్ని ఆంషిక్ సూర్య గ్రహణం అని పిలుస్తున్నారు. 27 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడనున్నదని.. మళ్ళీ ఇలాంటి గ్రహణం ఆగష్టు 2, 2027న ఏర్పడనుందని చేబుతున్నారు . అంతేకాదు అప్పుడు ఏర్పడే గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని .. భారత దేశంపై కూడా ప్రభావం చూపిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

తెలంగాణాలో ప్రధాన నగరమైన హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణ ప్రభావం ఉందనున్నదని.. సుమారు 46 నిముషాలు కొనసాగుతుంది. ఇక ఆంధ్రపదేశ్ లో విశాఖలో 5 గంటల 1 నిమిషం సయయంలో ఏర్పడనున్నదని.. దీని ప్రభావం 49 నిమిషాల పాటు ఉంటుంది.

రేపు గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలతో సహా అన్ని  ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన అనంతరం ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)