Vontimitta: శ్రీరామనవమి(Sriramanavami) వస్తుందంటే చాలు అందరి చూపు భద్రాచలం(Bhadrachalam) వైపే.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) .. తెలంగాణ, నవ్యంధ్రప్రదేశ్ గా విడిపోయిన అనంతరం ఏపీలో సీతారాముల కల్యాణాన్ని అధికారికంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి ప్రభుత్వ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో పరిమితంగా నిర్వహించగా .. తాజాగా రెండేళ్ళ తరువాత ఒంటిమిట్ట రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోదండ రాముడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జెఈవో , కడప కలెక్టర్ కలెక్టర్ విజయరామరాజు పరిశీలించారు. ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళలో సీతారాముల కల్యాణోత్సవం చేస్తున్నందున ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. భక్తుల రక్షణ కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నిమాపక వాహనం , వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేశారు.
ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో సీతారాముల కళ్యాణం : దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమిరోజున పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం రాత్రి జరుగుతుంది. చైత్ర మాస పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. శ్రీరామ నవమి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు.
సీతారాముల కళ్యాణం రాత్రి జరగడానికి కారణం ఏమిటంటే: చారిత్రాత్మక నేపధ్యం ఉన్న కోందండరామ స్వామీ ఆలయంలో స్వామి ఆలయంలో పున్నమి వెన్నెలలో కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఒక కథనం ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగటి సమయంలో జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేక పోతున్నానని చంద్రుడి విష్ణుమూర్తికి చెప్పడంతో.. నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిండు పున్నమి వెన్నెల సాక్షిగా సీత రాముడి వివాహం వేడుక జరుగుతుంది.
ఈ ఆలయం స్పెషాలిటీ ఏమిటంటే: ఈ ఆలయంలోని గర్భగుడిలో పూజలను అందుకుంటున్న సీతా రామలక్ష్మణులు ఏక శిలా నిర్మితాలు. రామ భక్తుడు ఆంజనేయ స్వామి గర్భగుడిలో కాకుండా ప్రత్యేకంగా సంజీవరాయుడుగా కొలువై ఉన్నాడు.
Also Read: Yadadri Temple: నాసాకు యాదాద్రి కలశాలకు సారుప్యత.. బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం