
ప్రతి వ్యక్తి జీవితంలో మంచి, చెడు రెండూ సహజం. మంచి సమయం మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. అయితే చెడు సమయంలో అయితే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే జీవితంలో మంచి సమయం లేదా చెడు సమయం ఏదైనా సరే వ్యక్తి జీవితంలో ఎక్కువ కాలం ఉండదు. మంచి సమయంలో జీవితంలో విలాసాలను అనుభవిస్తాడు. అయితే చెడు సమయంలో వ్యక్తికి జీవితం గురించి పాఠాలు నేర్పుతాయని నమ్ముతారు. చెడుకాలం రానుంది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని.. వాటిని గుర్తిస్తే మీకు చెడు కాలం ప్రారంభం కానుందని తెలుసుకోవచ్చని జ్యోతిష్యంలో చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు చెడు కాలం ప్రారంభమయ్యే ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..
ఎవరి ఇంట్లోనైనా తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే.. ఆ ఇంట్లో వ్యక్తులకు చెడు సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క ఎండిపోవడం అంటే ఆ ఇంట్లో రానున్న ఆర్థిక సంక్షోభాన్ని ముందస్తుగా సూచిస్తుంది.
ఇంట్లో నల్ల ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే.. అది చెడు కాలానికి సంకేతంగా పరిగణించబడుతుందని జ్యోతిష్యంలో చెప్పబడింది. అకస్మాత్తుగా ఎవరి ఇంట్లోనైనా చాలా నల్ల ఎలుకలు ఇంటికి రావడం మొదలు పెడితే.. భవిష్యత్తులో ఆ ఇంటిలో ఏదో విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలట.
జ్యోతిషశాస్త్రంలో బంగారు వస్తువును పోగొట్టుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఎవరైనా ఏదైనా బంగారు వస్తువును పోగొట్టుకుంటే ఆ ఇంట్లోకి ప్రతికూలత రావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే బంగారాన్ని సుఖ సంతోషాలకు చిహ్నంగా భావిస్తారు.
నెయ్యి ఉన్న పాత్ర చేతి నుంచి జారి కింద పడితే అది కూడా మంచిది కాదు. ఎవరి చేతి నుంచి అయినా నెయ్యి ఉన్న పాత్ర కింద పడి నేల అంతా చిందితే.. అది రాబోయే చెడు కాలాలకు సంకేతం.
ఇంట్లో బల్లులు పోట్లాడుకోవడం శుభం కాదు. ఇంట్లో బల్లులు పోరాడటం చెడు కాలం ప్రారంభానికి ముందస్తు సూచన అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
దేవుడికి పూజ చేస్తున్న సమయంలో పూజ కోసం ఉపయోగించే ప్లేట్ అకస్మాత్తుగా పడిపోతే అది మంచిది కాదు. ఇలా జరగడం రానున్న చెడు కాలానికి సంకేతం అని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. ఇలా జరిగితే వెంటనే పూజ గదికి వెళ్లి.. దేవుడిని క్షమించమని అడగాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు