శిశిరం తర్వాత వసంతరాన్ని తెస్తుంది ఉగాది.. ఆకులు రాల్చిన చెట్లు చిగురిస్తాయి. నవనవలాడుతూ కొత్త చివుళ్ళతో కొత్త శోభను సంతరించుకుంటాయి. కోయిల కువకువల గానం వీనుల విందుగా వినిపిస్తుంది. మానవ జీవితంలో సరికొత్త ఆశలను మోసుకొస్తుంది ఉగాది.. అదే తెలుగు వారు అంగరంగం వైభవంగా జరుపుకునే తెలువారి సంవత్సరాది. ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ, పంచాంగ శ్రవణమే గుర్తుకువస్తాయి
సనాతన హిందూ సంప్రదాయంలో కాలానుగుణంగా జరుపునే ప్రతి పండగలో మనిషికి ప్రకృతికి మధ్య బంధాన్ని అనుబంధాన్ని తెలియజేస్తూనే ఉంటాయి. ప్రకృతిలో మనిషి బంధం తరతరాలది. ఉగాది వస్తూ ప్రకృతిలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కనుక ఈ పండగ అక్షరాలా ప్రకృతి పండగ. ఈ పర్వదినం రోజున చేసుకునే ఉగాది పచ్చడి నుంచి పంచాంగ శ్రవణం పిండివంటల్లో అంతర్లీనంగా జీవితాన్ని నిర్వచిస్తుంది.
ఉగాది పచ్చడి జీవితంలో పరమార్ధం:
ఉగాది స్పెషల్ వేప పువ్వుతో చేసే పచ్చడి. ఆరు రుచుల సమ్మేళం.. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం ఇలా షడ్రులు కలిపి చేసేది. ఉగాది పచ్చడి. ఈ రుచులు జీవితంలోని పరమార్థాన్ని విడమర్చి చెబుతుందని.. సుఖదు:ఖాలు, కోపతాపాలు, ప్రేమాభిమానాలు, అభినందనలూ అవమానాలూ సహజం అని చెప్పకనే చెబుతుందని పెద్దలు చెబుతుంటారు. తీపి కోసం చేదును స్వీకరించినట్లే..గెలుపు కోసం ఓటమిని ఎదుర్కోవాలి.. రేపటి సుఖం కోసం ఈరోజు ఏర్పడిన కష్టాలను భరించాలనే జీవిత తత్వాన్ని భోదిస్తుంది.
ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:
వేపపువ్వు, నీరు, బెల్లం, మామిడి కాయలు, చింతపండు రసం, ఉప్పు, పచ్చి మిర్చి లేక కొంచెం కారం, కొత్త కుండ
తయారు చేసే విధానం:
కొత్త కుండను తీసుకుని ఒకటిన్నర కప్పు నీరు, రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు, కొద్దిపాటి వేప పువ్వులు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం, తగినంత ఉప్పు, రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు,
ఒక టేబుల్ స్పూన్ల చింతపండు రసం తీసుకుని కలుపుకోవాలి. కావాల్సిన వారు కొంచెం శనగ పప్పు, కొబ్బరి ముక్కలు, కిస్ మిస్, చెరకు కూడా వేసుకుంటారు
ఆరోగ్య ప్రయోజనాలు:
కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. పచ్చి మిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..