హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి శ్రీ కృష్ణ జన్మాష్టమి. కృష్ణ జన్మాష్టమిని కొందరు రెండు రోజుల పాటు జరుపుకుంటారు. మన దేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా కన్నయ్యకు భారీ సంఖ్యలో భక్తులున్నారు. కన్నయ్య జన్మదినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే కృష్ణుడి చిత్రం లేదా విగ్రహం కనిపించినడు ఈ విషయాలను గమనించారా.. శ్రీ కృష్ణుడు దగ్గర ఎప్పుడూ ఒక వేణువు..కిరీటంపై నెమలి ఈకతో ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడు నెమలి ఈకలను ఎందుకు ధరిస్తాడు? జన్మాష్టమి రోజున నెమలి ఈకలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా. ఈ విషయాలను ఈ రోజు తెలుసుకుందాం..
పురాణ కథలు ప్రకారం బృందావనంలో ఉన్న సమయంలో కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడు. ఈ సమయంలో రాధ కూడా అక్కడే ఉంది. క్రిష్ణువు వేణువు ఊడుతుంటే రాధ నృత్యం చేస్తోంది. రాధతో పాటు నెమలి కూడా నాట్యం చేస్తోంది. ఇలా నెమలి డ్యాన్స్ చేస్తున్న సమయంలో నెమలి ఈక ఒకటి కింద పడింది. అప్పుడు కృష్ణుడు ఆ నెమలి ఈకను అందుకుని తన నుదుటిపై ధరించాడట. అప్పటి నుండి కృష్ణుడు ఎప్పుడూ నెమలి ఈకలను ధరిస్తాడు. ఆ క్షణం నుండి నెమలి ఈకలు అతనికి ఇష్టమైన అలంకర వస్తువులో ఒకటిగా మారిపోయింది.
జన్మాష్టమి రోజున ఇంటికి నెమలి ఈకలను తెచ్చుకోవాలనేది ఒక నమ్మకం. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జన్మాష్టమి శుభ సందర్భంగా ఇంటికి నెమలి ఈకను తీసుకురావడం ద్వారా కలిగే ఐదు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ప్రతికూల శక్తి పోతుంది: నెమలి ఈకలను సానుకూలతకు మూలంగా పరిగణిస్తారు. ఇంట్లోకి తీసుకురావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి నిస్తేజాన్ని దూరం చేస్తుంది. నెమలి ఈకలను మీ ఇంటి ప్రధాన ద్వారం మధ్యలో లేదా పక్కన పెట్టాలి. నెమలి ఈకలు ద్వారం కనిపించే విధంగా ఉంచాలి అంటారు. ఇలా చేయడం వలన ఇంటి వెలుపలి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
విద్యా రంగంలో ప్రయోజనం: ప్రతి ప్రాంతంలోనూ నెమలి ఈకల వాడకం భిన్నంగా ఉంటుంది. అదే సమయంలో నెమలి ఈకలు తెచ్చుకోవడం వలన కలిగే పరిష్కారాలు కూడా భిన్నంగా ఉంటాయి. విద్యార్థులకు కూడా నెమలి ఈకలు ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థులు తమ స్టడీ రూమ్‌లో ఎప్పుడూ నెమలి ఈకలను ఉంచుకోవాలి. నెమలి ఈకలను ఈశాన్య దిశలో ఉంచడం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది.
ఆరోగ్యపరంగా లాభాలు: అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నివసించే ఇంట్లో నెమలి ఈకలను ఉంచవచ్చు. ఇలా చేయడం వలన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యం సంతరించుకుంటారని నమ్మకం. అంతేకాదు కుటుంబంలోని ఇతర సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తం కుటుంబం సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు.
వివాహ, ప్రేమ సంబంధాల్లో ఆటంకాలు తొలగిపోతాయి: నెమలి ఈకలు ప్రేమికులకు, జంటలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమికులు నెమలి ఈకలను తమ వద్ద ఉంచుకుంటే, అది సంబంధాలలో ఉద్రిక్తతను తగ్గించి, వైవాహిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు భార్యాభర్తల మధ్య సంబంధాలు విబేధాలు ఉంటె ఇంట్లోని పడకగదిలో నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. వివాదాలు సమసి సాన్నిహిత్యం పెరుగుతుంది.
ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది: ఇంట్లో చాలా కాలంగా ఆర్థిక సమస్య ఉండి.. దాని నుండి ఉపశమనం పొందలేకపోతే, నెమలి ఈకలు ప్రభావవంతంగా ఉంటాయి. నెమలి ఈకను చాలా శుభప్రదంగా భావిస్తారు. వీటిని కృష్ణాష్టమి రోజున ఇంటికి తీసుకురావడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరం లభిస్తుందని నమ్మకం. ఇంట్లో డబ్బు, నగలను ఉంచే స్థలంలో నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేయడం వలన ఆర్ధిక ప్రయోజనం పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు