Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srawan Mas: శ్రావణ మాసంలో సోమవారం శివయ్యని ఇలా పూజించండి.. ఇంట్లో సుఖసంపదలు మీ సొంతం..

శ్రావణ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైనదని పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతి సోమవారం శివుడిని ప్రత్యేక నియమాలతో పూజించడం వలన శివుని అనుగ్రహం పొందవచ్చు. అలాంటి కొన్ని ప్రత్యేక నియమాలతో ఎలా శివుడిని పూజించాలి ఈరోజు తెలుసుకుందాం.. 

Srawan Mas: శ్రావణ మాసంలో సోమవారం శివయ్యని ఇలా పూజించండి.. ఇంట్లో సుఖసంపదలు మీ సొంతం..
Shravan 2022
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2022 | 10:39 AM

Srawan Mas 2022: లయకారుడు  శివుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే భోళాశంకరుడి అనుగ్రహం లభిస్తే, ఎటువంటి ఇబ్బందులైనా సరే.. దూరంకావాల్సిందే. శివుని అనుగ్రహం పొందడానికి భక్తులు హరహర మహాదేవ అంటూ జలంతో అభిషేకం చేసినా చాలు.  శివయ్యని సంతోషపెట్టడానికి, కొందరు రోజూ నీటితో అభిషేకం చేస్తారు. మరికొందరు ఉపవాసం ఉంటారు. ప్రతి సోమవారం శివుడిని పూజించడం చాలా శ్రేయస్కరం. హిందూపురాణాల ప్రకారం సోమవారం శివునికి అంకితం చేయబడిందని  చెప్పబడింది. మరికొద్ది రోజుల్లో శ్రావణ  మాసం ప్రారంభం కానుంది. ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున శివుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

శ్రావణ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైనదని పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతి సోమవారం శివుడిని ప్రత్యేక నియమాలతో పూజించడం వలన శివుని అనుగ్రహం పొందవచ్చు. అలాంటి కొన్ని ప్రత్యేక నియమాలతో ఎలా శివుడిని పూజించాలి ఈరోజు తెలుసుకుందాం..

మొదటి సోమవారం నివారణ: శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఉపవాసం ఉండి ఉదయాన్నే తలస్నానం చేసి గంగాజలం, పచ్చి పాలు కలిపి శివునికి సమర్పించాలి.  ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించడంలో సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు. అంతే కాదు మంచి భర్త లేదా భర్త కావాలనుకునే అమ్మాయిలు .. శివయ్యకు అభిషేకం చేసే సమయంలో కొన్ని బియ్యపు గింజలు లేదా కొంచెం చక్కెర వేసి శివునికి సమర్పించడంవలన మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రతి సోమవారం ఈ పరిహారం చేయండి: ప్రతి సోమవారం ఉపవాసం ఉండవచ్చు.. సోమవారం రోజున శివలింగానికి జలాన్ని సమర్పించడం మర్చిపోవద్దు. శివారాధనలో  జలాభిషేకం ప్రాముఖ్యత గ్రంధాలలో కూడా చెప్పబడింది. ప్రతి సోమవారం తప్పనిసరిగా దానం చేయాలి. సోమవారం ఆవుకు పాలకూర తినిపించండి. ఇది కాకుండా,  ప్రతి సోమవారం.. శివాలయానికి వెళ్లి పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయండి.

బిల్వ పత్రం: బిల్వ పత్రపై చందనంతో ‘ఓం నమఃశివాయ’ అని రాసి మహాదేవునికి సమర్పిస్తే ఏ కార్యమైనా నెరవేరుతుంది. అంతే కాకుండా శంఖం పువ్వు మహాదేవ్ కి చాలా ప్రీతికరమైనది. ఈ పువ్వులను మాల తయారు చేసి మహాదేవునికి అర్పిస్తే.. చాలా సంతోషిస్తాడు. అంతే కాకుండా వ్యాధులతో బాధపడేవారు శ్రావణ మాసంలో పాలు, నీళ్ళు కలిపి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయాలి. ఇది చాలా అద్భుత నివారణగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)