Lord Shaniswara: శని దోషం తొలగాలంటే.. ప్రతి శనివారం ఆవ నూనెతో నివారణ చేసి చూడండి..

|

May 19, 2023 | 2:01 PM

శని దోషం తొలగిపోవాలంటే ఎక్కువగా ప్రతి శనివారం గుడికి వెళ్లి శనీశ్వరుడుని పూజిస్తారు. శనివారం రోజున ఆవాలనూనె నైవేద్యంగా పెట్టడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పురాణాల నమ్మకం. అయితే శని దేవుడికి ఆవాల నూనెను మాత్రమే ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసుకుందాం.. 

Lord Shaniswara: శని దోషం తొలగాలంటే.. ప్రతి శనివారం ఆవ నూనెతో నివారణ చేసి చూడండి..
Lord Shaniswara
Follow us on

హిందూ ధర్మంలో సూర్యుడు తనయుడు శనీశ్వరుడు మానవ కర్మానుసారం ఫలితాలను ఇస్తాడని నమ్మకం.    కర్మలోని మంచి చెడులను జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. శనీశ్వరుడు దృష్టి వక్రంగా ఉంటే  జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. మరోవైపు శనీశ్వరుడు సంతోషంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుంది. శని దోషం తొలగిపోవాలంటే ఎక్కువగా ప్రతి శనివారం గుడికి వెళ్లి శనీశ్వరుడుని పూజిస్తారు. శనివారం రోజున ఆవాలనూనె నైవేద్యంగా పెట్టడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పురాణాల నమ్మకం. అయితే శని దేవుడికి ఆవాల నూనెను మాత్రమే ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసుకుందాం..

శనీశ్వరుడికి ఆవాల నూనె నైవేద్యంగా పెడతారు. దీని వెనుక ఉన్న కథ రామాయణ కాలానికి సంబంధించినది. లంక నుండి సీతను విడిపించడానికి శ్రీరాముడు తన సైన్యంతో కలిసి సముద్రంపై వంతెనను నిర్మించడానికి రెడీ అవుతాడు. అయితే వంతెన నిర్మాణం సమయంలో ఏ రాక్షసులు హాని చేయకుండా హనుమంతుడు ఆ వంతెన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఈ సమయంలో హనుమంతుడు  శ్రీరాముని ధ్యానంలో ఉన్న సమయంలో శనీశ్వరుడు హనుమంతుడి ధ్యానాన్ని భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. ఆంజనేయస్వామిని కోతి అని పిలుస్తూ తనతో యుద్ధం చేయమని పిలిచాడు. అయితే తన ధ్యానానికి భంగం కలిగించవద్దని ఆంజనేయస్వామి విజ్ఞప్తి చేశాడు. అయితే శనీశ్వరుడు.. ఒప్పుకోకుండా.. యుద్ధానికి రమ్మంటూ కాలుదువ్వాడు.

ఆవాల నూనెను ఎందుకు నైవేద్యంగా పెడతారంటే? 
ఆంజనేయస్వామికి కోపం వచ్చి.. శనీశ్వరుడిని తన తోకతో చుట్టేశాడు. అప్పుడు శనీశ్వరుడు బాధతో గిలాగిలాడాడు. అయినప్పటికీ హనుమంతుడు శని అహంకారాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతో… ఆంజనేయస్వామి శ్వనీశ్వరుడిని తోకతో ఎత్తి రాళ్లపై విసిరేశాడు. అప్పుడు శని చాలా గాయపడ్డాడు. అంతేకాదు తాను చేసిన పనికి చాలా బాధపడ్డాడు. పశ్చాత్తాపడ్డాడు. తనను విచిపెట్టమని భజరంగబలికి విజ్ఞప్తి చేశాడు. తాను అహంకారంతో చేసిన నేరానికి శిక్ష అనుభవించానని, ఇక నుంచి అలాంటి తప్పు చేయనని  హనుమంతుడికి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఆవ నూనెతో ఉపశమనం 
గాయాల నుంచి శని దేవుడికి ఉపశమనం కలిగించడానికి హనుమంతుడు ఆవాల నూనె ఇచ్చాడు. ఆ నూనెను గాయాలకు పూసుకోగానే  శనీశ్వరుడు గాయాల నొప్పి తగ్గింది.. ఆనందం కలిగింది. అప్పుడు శనీశ్వరుడు .. హనుమంతుడి పూజించి ఆవ నూనెను సమర్పించిన వారిపై తన అనుగ్రహం ఉంటుందని వరం ఇచ్చాడు. శనీశ్వరుడు తన భక్తుల బాధలను తొలగిస్తాడని విశ్వాసం.  అప్పటి నుండి శని దేవుడికి ఆవాల నూనె నైవేద్యంగా పెట్టడం జరుగుతూనే ఉంది. ఎవరి జాతకంలో ఎలి నాటి శని ఉంటుందో.. వారు ప్రతి శనివారం శని దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. శనిదేవునికి ఆవాలనూనె నైవేద్యంగా సమర్పిస్తే.. ఆయన అనుగ్రహం, ఆశీస్సులు భక్తులకు కలుగుతాయి. అయితే ఆవనూనెను నైవేద్యం సమర్పించే ముందు తప్పకుండా నీడను దానం చేయాలి.

నీడ ఎలా దానం చేయాలంటే..? 
శనీశ్వరుడి సమర్పించడానికి ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోండి. అనంతరం ఆ నూనెలో మీ ముఖం నీడను చూడండి. ఇలా చేయడం వలన శనిగ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవి తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..