మన దేశంలో హనుమంతుడిని వివిధ రకాలుగా పూజిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే హనుమంతుని పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. ఎవరైనా పెద్ద సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం హనుమంతుడిని ఆరాధించడం, కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. బాధలను తొలగిస్తాడని నమ్మకం.
బెల్లం శనగలు
హనుమంతుని ఆరాధనలో బెల్లం, శనగల పప్పుల ప్రసాదం అందించబడుతుంది. ఇలా చేయడం వలన అంగారక గ్రహానికి పరిహారం లభిస్తుంది. హనుమంతుడికి బెల్లం, శనగలను ప్రసాదంగా అందించడం వల్ల మంగళ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతి మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించడం వలన జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. సంతోషం కూడా పెరుగుతుంది.
కొబ్బరి కాయ
హిందూమతంలో ఆరాధన సమయంలో కొబ్బరికాయను దేవుళ్ళకు, దేవతలకు సమర్పిస్తారు. అయితే అన్ని దేవుళ్లకు కొబ్బరికాయను సమర్పించే విషయంలో నియమాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి మొత్తం కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే మరికొందరికి కొబ్బరికాయను పగల గొట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం హనుమంతునికి కొబ్బరికాయను సమర్పించే ముందు, దానిపై సిందురాన్ని అద్దండి. తర్వాత ఆ కొబ్బరి కాయను పగలగొట్టి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆర్థిక సంక్షోభం, పేదరికం నుంచి ఉపశమనం పొందుతాడు.
తమలపాకు
జీవితంలో నియంత్రణకు మించిన తీవ్రమైన సంక్షోభం లేదా ప్రమాదకరమైన పని ఏదైనా ఉంటే, ఆ పనిని తమలపాకులతో పాటు హనుమంతుడికి అప్పగించండి. ఇందుకోసం మంగళవారం రోజున హనుమంతుడిని ఆలయంలో పూజించిన తర్వాత తమలపాకును సమర్పించండి. ఇలా చేయడం వల్ల చెడు తొలగి , కష్టాలు, నష్టాలు పరిష్కారమవుతాయని నమ్ముతారు.
మిఠాయి
హనుమంతుడికి మిఠాయి అంటే చాలా ఇష్టం. ఎవరైనా మంగళవారం లేదా శనివారం హనుమంతుడిని పూజించిన తర్వాత మిఠాయిని నైవేద్యంగా పెట్టి.. తర్వాత ప్రసాదంగా పంచితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం.
కేసరి బాత్
హనుమంతుడికి కుంకుమపువ్వు అంటే చాలా ఇష్టం. మంగళ శాంతి కోసం ఉజ్జయినిలో మంగళనాథునికి కుంకుమపువ్వు నైవేద్యంగా పెట్టే సంప్రదాయాన్ని కూడా పాటిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు