Sankatahara chaturthi: చేపట్టిన పనుల్లో ఆటంకాలా.. రేపు గణపయ్యను పూజించి.. వీటిని దానం చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..

సంకట హర చతుర్థి ఉపవాసం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది, ఈ రోజున ఉపవాసంతో పాటు వినాయకుడిని పుజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోయి జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం. తెలుగు సంవత్సరంలో మొదటి సంకట హర చతుర్ధి చైత్ర మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకోనున్నారు. ఈ తిధి ఏప్రిల్ 1వ తేదీన వచ్చింది.

Sankatahara chaturthi: చేపట్టిన పనుల్లో ఆటంకాలా.. రేపు గణపయ్యను పూజించి.. వీటిని దానం చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..
Sankatahara Chaturthi 2025

Updated on: Mar 31, 2025 | 1:58 PM

హిందూ మతంలో చతుర్థి తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ప్రతి నెల శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే చతుర్థి తిథి విఘ్నాలకది పతి వినాయకుడికి అంకితం చేయబడింది. ప్రతి నెల కృష్ణ, శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజున సంకటహర చతుర్థి ఉపవాసం పాటిస్తారు. ప్రతి నెల శుక్ల పక్ష చతుర్థిని వినాయక చతుర్థి అంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. ఆచారాల ప్రకారం ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి గణేశుడిని పూజిస్తారో వారిపై గణపతి అనుగ్రహం కలుగుతుంది. అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. ఈ సంవత్సరం చైత్ర మాసంలో మొదటి సంకటహర చతుర్థి రేపు. ఈ రోజు పూజా విధానం, ఉపవాసం విరమణ, శుభ సమయం గురించి తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ఏప్రిల్ 1న ఉదయం 5:42 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ శుక్ల పక్ష చతుర్థి తిథి ఏప్రిల్ 2న తెల్లవారుజామున 2:32 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పాటిస్తారు. కనుక సంకటహర చతుర్ధి ఏప్రిల్ 1వ తేదీన అంటే రేపు జరుపుకోనున్నారు. రేపు వినాయక చవితి ఉపవాసం పాటించబడుతుంది.

సంకటహర చతుర్ధి శుభ సమయం

బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 5:25 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 3:20 వరకు కొనసాగుతుంది.

సంధ్యా ముహూర్తం సాయంత్రం 6:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 7:01 గంటల వరకు కొనసాగుతుంది.

నిషిత ముహూర్తం మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 12:48 వరకు కొనసాగుతుంది.

పూజా విధానం

సంకటహర చతుర్ధి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకోవాలి. తరువాత పూజ చేసే ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్నిప్రతిష్టించి.. తర్వాత గంగా జలంతో స్నానం చేయాలి. తరువాత గణేశుడికి పంచామృతంతో స్నానం చేయాలి. ఆనంతరం స్వామిని శుభ్రమైన నీటితో స్నానం చేయించాలి. గణేశుడికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి. తర్వాత గంపయ్యకు ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. గణపయ్యను పూజిస్తూ మంత్రాలను జపించాలి. సంకటహర చతుర్ధి ఉపవాస కథను పారాయణం చేయాలి. చివరగా గణపతికి హారతినిచ్చి పూజను ముగించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి.

సంకటహర చతుర్ధి ఏమి తినాలి? ఏమి తినకూడదు?

సంకటహర చతుర్ధి రోజున అరటిపండు, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు తినాలి. పాలు, పెరుగు, జున్ను, శ్రీఖండ్ మొదలైనవి తీసుకోవాలి. సగ్గుబియ్యం కిచిడి లేదా సేమ్యా పాయసం తినాలి. వాటర్ చెస్ట్‌నట్ పిండితో చేసిన పూరీ లేదా పుడ్డింగ్ తినాలి. బంగాళాదుంప కూర లేదా టిక్కీ తినాలి. వేరుశనగ గింజలు లేదా వేరుశనగ చిక్కీ తినాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. ఈ రోజున బియ్యం, గోధుమలు, పప్పులు మొదలైన వాటిని తినకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు. పొరపాటున కూడా మాంసం, మద్యం తినకూడదు. వేయించిన ఆహారాలు తినకూడదు.

ఈ రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

ఈ రోజున సాత్విక జీవనశైలిని అవలంబించాలి. ఈ రోజున ఆధ్యాత్మికమైన పనులు చేయాలి. పూజ సమయంలో గణేశుడికి దర్భలను సమర్పించాలి. పేదలకు, అవసరార్థులకు దానం చేయాలి. ఈ రోజున ఎవరితోనూ వాదించకూడదు. ఎవరికీ హాని చేయకూడదు. వినాయకుడి పూజలో పొరపాటున కూడా తులసిని సమర్పించకూడదు. ఈ రోజున చంద్రుడిని చూడకూడదు.

ఏ వస్తువులను దానం చేయాలంటే

వినాయక చవితి రోజున పండ్లు దానం చేయాలి. పేదలకు, అవసరార్థులకు బట్టలు, ఆహారం దానం చేయాలి. ధన దానం చేయాలి. ఉండ్రాళ్ళు, కుడుములను ప్రసాదంగా పంచడం శుభప్రదం.

ఏ మంత్రాలను జపించాలంటే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్

సంకటహర చతుర్ధి ప్రాముఖ్యత

సంకటహర చతుర్ధి ఉపవాసం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం వినాయక చవితి రోజున పూజలు చేయడం ఉపవాసం ఉండటం ద్వారా వినాయకుడు సంతోషించి ఆశీస్సులు ఇస్తాడు. గణపతి ఆశీస్సుల వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. జ్ఞానం, తెలివి తేటలు లభిస్తాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే అన్ని కోరికలు నెరవేరుతాయి.

ఉపవాసం విరమించే సమయం

సంకటహర చతుర్ధి ఉపవాసం చేసిన వారు మర్నాడు ఉపవాసం విరమించాలని హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో చైత్ర మాసంలో సంకటహర చతుర్ధి ఉపవాస విరమణ ఏప్రిల్ 2న సూర్యోదయం తర్వాత చేయాల్సి ఉంటుంది. వినాయక చతుర్థి ఉపవాసం విరమించే ముందు నీటితో స్నానం చేయాలి. గణేశుడి విగ్రహం ముందు ధూపం, దీపాలను వెలిగించాలి. చేతిలో నీళ్లు తీసుకుని ఉపవాసం ముగిస్తున్నట్లు సంకల్పించుకోవాలి. పండ్లు, పాలు, పెరుగుని తినడం ద్వారా ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం వలన సంకటహర చతుర్ధి రోజున చేసిన పూజ ఫలితం దక్కుతుందని విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు