Nail Personality Trait: మనిషిలోని మంచి, చెడు గుణాలను గోర్లు గుర్తులు, షేప్స్ ద్వారా గుర్తించవచ్చు..

|

Aug 19, 2023 | 10:11 AM

వ్యక్తి చేతులు, కాళ్ళకున్న గోళ్ల ఆకృతి, రంగును చూసి.. వ్యక్తి విధిని తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. వ్యక్తి గోళ్ళను పరిశీలించి  తద్వారా వ్యక్తిలో దాగి ఉన్న మంచి, చెడులను తెలుసుకోవచ్చు. గోళ్ల రంగు.. వాటి గుర్తులు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుందాం.. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చతురస్రాకారపు గోర్లు కలిగి ఉన్న వ్యక్తులు.. తమకు కావాల్సిన దానికోసం ఎంత కష్టమైనా పడతారు.

Nail Personality Trait: మనిషిలోని మంచి, చెడు గుణాలను గోర్లు గుర్తులు, షేప్స్ ద్వారా గుర్తించవచ్చు..
Nail Personality Trait
Follow us on

వ్యక్తి భవిష్యత్ జనన నక్షత్రం, లేదా నామ నక్షత్రం తో కొందరు భవిష్యత్ ను తెలుసుకుంటే.. మరి కొందరు  హస్తసాముద్రికం ద్వారా తమ గతం, భవిష్యత్తు, వర్తమానాన్ని తెలుసుకుంటారు. తమ చేతులపై ఉన్న గీతలను చూపించుకుని తమ భవిష్యత్ ను తెలుసుకుంటారు. అదే విధంగా వ్యక్తి చేతులు, కాళ్ళకున్న గోళ్ల ఆకృతి, రంగును చూసి.. వ్యక్తి విధిని తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. వ్యక్తి గోళ్ళను పరిశీలించి  తద్వారా వ్యక్తిలో దాగి ఉన్న మంచి, చెడులను తెలుసుకోవచ్చు. గోళ్ల రంగు.. వాటి గుర్తులు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుందాం..

చతురస్రాకార గోర్లు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే..

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చతురస్రాకారపు గోర్లు కలిగి ఉన్న వ్యక్తులు.. తమకు కావాల్సిన దానికోసం ఎంత కష్టమైనా పడతారు. ఇలా కష్టపడిన తర్వాత మాత్రమే కోరుకున్న వస్తువులను పొందుతారు. వీరు ఎలాంటి రిస్క్ తీసుకోవాలన్నా భయపడరు. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారు. అంతేకాదు తమ చింతలను మనసులో దాచుకుంటారు.

ఇటువంటి గోర్లు ఉన్న వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు

సాముద్రిక శాస్త్రం ప్రకారం వేలు గోళ్లు సూటిగా ఉన్న వ్యక్తులు.. మొండిగా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తులు  తరచుగా ఇతరుల వివాదంలో చిక్కుకోవడం అలవాటు. సృజనాత్మక సామర్థ్యంతో సమృద్ధిగా ఉండటం వలన, ఇలాంటి వ్యక్తులు తరచుగా ఇతరులపై పాలించటానికి ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

ఇటువంటి గోర్లు ఉన్న వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు

సాముద్రిక శాస్త్రం ప్రకారం గోర్లు గుండ్రంగా లేదా అండాకారంగా ఉన్న వ్యక్తులు ఇతరులతో త్వరగా కలిసిపోతారు. తరచుగా ఇతరులతో కలిసి గడుపుతారు. గుండ్రని గోర్లు ఉన్న వ్యక్తులు స్నేహశీలియైన స్వభావం కలిగి ఉంటారు. గుండ్రని గోర్లు ఉన్న వ్యక్తులను ప్రజలను సొంతం చేసుకుంటారు.

ఇటువంటి గోర్లు ఉన్న వ్యక్తులు చాలా సూటిగా ఉంటారు

సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతుల్లో పొడవాటి గోర్లు ఉన్నవారు చాలా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. సౌమ్య స్వభావమున్న వారు కనుక ఏ పనైనా మంచి పద్ధతిలో చేస్తారు. కళారంగంలో చాలా పేరు సంపాదిస్తారు.

ఏ రకమైన గోర్లు ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉంటారంటే..

సాముద్రిక శాస్త్రం ప్రకారం వంకరగా ఉన్న గోర్లు వ్యక్తులు చాలా కష్టపడిపనిచేస్తారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో పెరగడానికి రకరకాల పోరాటాలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కృతనిశ్చయంతో ఎదుర్కొనేందుకు, కష్టాలకు భయపడకుండా ఉండడానికి ఇదే కారణం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)