Samatha Kumbh 2025: వికాస తరంగిణి ఆధ్వర్యంలో సమతా యాత్ర.. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి

సమతా కుంబ్‌-2025 ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో..నెక్లెస్ రోడ్డులో సమతా యాత్ర సాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నశ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి.. నెక్లెస్‌ రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరారు. పీపుల్స్‌ ప్లాజా వరకు జరిగే సమతా యాత్రలో.. పెద్దసంఖ్యలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణాయ అంటూ సమతా యాత్ర చేపట్టారు.

Samatha Kumbh 2025: వికాస తరంగిణి ఆధ్వర్యంలో సమతా యాత్ర.. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి
Samatha Yatra

Updated on: Feb 09, 2025 | 4:43 PM

సమతాకుంభ్‌ 2025 ఆధ్యాత్మిక వేడుకలు ఆరంభం అయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో, శ్రీరామనుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో..నెక్లెస్ రోడ్డులో సమతా యాత్ర సాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నశ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి.. నెక్లెస్‌ రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరారు. పీపుల్స్‌ ప్లాజా వరకు జరిగే సమతా యాత్రలో.. పెద్దసంఖ్యలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణాయ అంటూ సమతా యాత్ర చేపట్టారు. అందరూ భగవంతుడి ముందు సమానమేనని, ఆ భగవంతుడి స్వరూపమే ఈ సమాజం అన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి. శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామి చేపట్టిన సామాజిక సంస్కరణలను 1927లోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చాటి చెప్పారన్నారు.  మన వంతు శారీరక శ్రమ, విజ్ఞానం సమాజానికి ఇవ్వాలని భగవత్ శ్రీ రామానుజచార్య చెప్పారని వివరించారు. సమత కుంభ 2025 లో అందరూ పాల్గొనాలని సూచించారు.  మనలోని అహంభావాన్ని తొలగించుకోడానికి ఇదో మంచి వేదిక అని చెప్పారు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి.

స్వామి వారి దగ్గరకు వస్తే ఆత్మీయ కలయిక భావం కలుగుతుందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.  సమతా భావం వస్తుందని చెప్పారు.
ఆధునిక సమత మూర్తి డాక్టర్ అంబేద్కర్ నుంచి సమతా యాత్ర ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.  విప్లమాత్మక ఆధ్యాత్మిక భావంతో చిన్న జీయర్ స్వామి ఈ యాత్రను ప్రారంభించడం మంచి విషయమన్నారు.  మహిళలకు ఎంతో సేవను అందిస్తున్నారని కొనియాడారు. కేవలం రాజకీయాలే కాదు ఆధ్యాత్మిక భావంతో కూడా రాజకీయ నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అద్దంకి దయాకర్.
భద్రాద్రి రామయ్యను దర్శించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని.. ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు అద్దంకి దయాకర్.  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం
ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయక సహకారాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..