Safala Ekadashi: చేపట్టిన పని విజయవంతంకావాలంటే.. సఫల ఏకాదశి వ్రతమాచరించండి.. పూజా విధానం మీ కోసం..

Safala Ekadashi 2021: హిందూపురాణాల్లో ఏకాదశి ఉపవాసం చాలా మంచిదని చెప్పబడింది. కఠోరమైన తపస్సు, అశ్వమేధ యాగం, అన్ని పవిత్ర నదులలో స్నానం చేయడం కంటే..

Safala Ekadashi: చేపట్టిన పని విజయవంతంకావాలంటే.. సఫల ఏకాదశి వ్రతమాచరించండి.. పూజా విధానం మీ కోసం..
Saphala Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Dec 17, 2021 | 8:08 AM

Safala Ekadashi 2021: హిందూపురాణాల్లో ఏకాదశి ఉపవాసం చాలా మంచిదని చెప్పబడింది. కఠోరమైన తపస్సు, అశ్వమేధ యాగం, అన్ని పవిత్ర నదులలో స్నానం చేయడం కంటే ఈ ఉపవాసం చేస్తే కలిగే పుణ్యం గొప్పదని నమ్మకం. ఏకాదశి వ్రతం  పుణ్య ప్రభావం వలన,  పాపాలు నశించి.. భూమిపై సుఖంగా జీవించి చివరకు పరమాత్మలో లీనమవుతాడని విశ్వాసం. మీరు కూడా ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా  శుభఫలితాలను పొందాలనుకుంటే.. మీరు సఫల ఏకాదశిలో ఈ వ్రతాన్ని ఆచరించండి..

ప్రతి నెలలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని వివిధ పేర్లతో నిర్వహిస్తారు. వీటి గ్రంధాలలో చెప్పబడింది. పుష్య మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశి 24 ఏకాదశిల్లో మొదటి ఏకాదశిగా పరిగణించబడుతుంది.  ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ 30, 2021, గురువారం వచ్చింది. దీంతో ఏకాదశి ఈ సంవత్సరం చివరి ఏకాదశిగా జరుపుకుంటారు. సఫల ఏకాదశి వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. ఈ ఉపవాసానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..

శుభ సమయం:  ఏకాదశి తేదీ ప్రారంభం : డిసెంబర్ 29, 2021 బుధవారం సాయంత్రం 04:12 నుండి

ఏకాదశి తేదీ ముగుస్తుంది : 30 డిసెంబర్ 2021  గురువారం మధ్యాహ్నం 01:40 నిమిషాలకు

సఫల ఏకాదశి పూజా విధానం ఏదైనా ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి. అనంతరం ఉపవాస నియమాలను పాటించాలీ. ఏకాదశి రోజున   సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి.  అక్షతలు, గంధం, పూలు, తులసి ఆకులు, అగరుబత్తీలు, తమలపాకులు, పండ్లు దేవునికి సమర్పించాలి. అనంతరం సఫల ఏకాదశి నాడు ఉపవాసం కథను చదవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. రోజంతా మెలకువగా  నారాయణుని స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు, స్నానం చేసిన తరువాత, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వండి. దీని తరువాత, అతని ఆశీర్వాదం తీసుకుని, ఉపవాసం విరమించాలి.  దశమి రాత్రి నుండి ద్వాదశి నాడు ఉపవాసం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

ఉపవాసం యొక్క ప్రాముఖ్యత సఫల ఏకాదశి ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి వివరించాడు. ఈ ఉపవాసం గురించి, శ్రీకృష్ణుడు చెప్పాడు, పెద్ద యాగాలు చేసినా, సఫల ఏకాదశి వ్రతానికి ఉన్నంత సంతృప్తి నాకు లభించదు. ఈ ఉపవాసం వ్యక్తికి అన్ని పనులలో ఆశించిన విజయాన్ని ఇస్తుంది. అత్యంత పుణ్యం, శుభప్రదం. సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం తర్వాత భజన కీర్తనలు చేసే భక్తులు ఈ వ్రతంతో ఉత్తమ ఫలితాలను పొందుతారు. అటువంటి వ్యక్తి జీవిత సుఖాలను అనుభవిస్తూ మరణానంతరం విష్ణులోకాన్ని పొందుతాడని శ్రీకృష్ణుడు చెప్పాడు.

Also Read:  కొత్త ఏడాదిలో ఈ రాశివారికి అన్నింటా సక్సెస్.. ఆర్ధికంగా మంచి లాభాలను సొంతం చేసుకుంటారు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!