sabarimala ayyappa temple: అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డు..

అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవసోం బోర్డు తీపి కబురు చెప్పింది. స్వామివారి దర్శనంపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కొంచెం కొంచెంగా..

sabarimala ayyappa temple: అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డు..

Updated on: Dec 23, 2020 | 5:52 AM

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవసోం బోర్డు తీపి కబురు చెప్పింది. స్వామివారి దర్శనంపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కొంచెం కొంచెంగా సడిలిస్తూ వస్తోన్న బోర్డ్.. తాజాగా శబరిమల వచ్చే భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారింభించాలని నిర్ణయించింది. అయితే స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు కోవిడ్ -19 నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి తేల్చి చెప్పింది. డిసెంబర్ 26 నుంచి అయ్యప్ప స్వామి దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవసోం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు డిసెంబర్ 26వ తేదీన శబరిగిరీశుడి చెంత మండల పూజ నిర్వహించేదుకు ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇదిలాఉండగా, కరోనా కారణంగా మూత బడిన శబరిమల ఆలయం గత రెండు నెలల క్రితం తెరిచారు. ఆ సమయంలో కేవలం మందికి మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతించారు. ఆ తరువాత సంఖ్యను కాస్తా 2000 లకు పెంచారు. అలా శబరిమలలో నిత్యం 5000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు కేరళ ప్రభుత్వం సైతం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభిస్తున్నారు. కాగా, శబరిమలకు వచ్చే భక్తులు తప్పనసరిగా కరోనా నిబంధనలను పాటించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

 

Also read:

Agrigold Scam: అగ్రీ గోల్డ్ వ్యవహారంలో స్పీడ్ పెంచిన ఈడీ.. ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన అధికారులు..

Kerala State Govt: కేరళ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్.. సీఎం పినయర్ ఆగ్రహం..