Agrigold Scam: అగ్రీ గోల్డ్ వ్యవహారంలో స్పీడ్ పెంచిన ఈడీ.. ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన అధికారులు..

అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. మనీ ల్యాండరింగ్ కేసులో అగ్రి గోల్డ్ సంస్థకు చెందిన ముగ్గురు..

Agrigold Scam: అగ్రీ గోల్డ్ వ్యవహారంలో స్పీడ్ పెంచిన ఈడీ.. ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన అధికారులు..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:49 AM

Agrigold Scam: అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. మనీ ల్యాండరింగ్ కేసులో అగ్రి గోల్డ్ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్లంతా కలిసి రూ. 6,400 కోట్లు స్కామ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే చైర్మన్‌తో పాటు ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు.

కాగా, అగ్రిగోల్డ్ స్కామ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంట్లో పెట్టుబడి పెట్టి ఎంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది అయితే నష్టపోయామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.

Also read:

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం..

కృష్ణా జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..నిధి కోసం వెళ్లితే దిమ్మతిరిగిపోయింది