Kerala State Govt: కేరళ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్.. సీఎం పినయర్ ఆగ్రహం..

కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ షాక్ ఇచ్చారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి ఆయన..

Kerala State Govt: కేరళ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్.. సీఎం పినయర్ ఆగ్రహం..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:50 AM

Kerala State Govt: కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ షాక్ ఇచ్చారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి ఆయన అనుమతి నిరాకరించారు. దాంతో గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రత్యేక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని సీఎం పినరయి విజయన్ భావించారు. ఇందులో భాగంగా ప్రత్యేక అసెంబ్లీ సమాశం నిర్వహించడానికి గవర్నర్ అనుమతి కోరారు. ఈ విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు గవర్నర్ అరిఫ్ ప్రకటించారు. అంతేకాదు.. అత్యవసరంగా అసెంబ్లీ నిర్వహించడానికి కారణమేంటో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన వివరణ కోరారు. అయితే గవర్నర్ చర్యతో షాక్ తిన్న కేరళ సీఎం.. ఆయన చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం చేసిన సిఫారసే తిరస్కరించడానికి గవర్నర్‌కు ఏమాత్రం అధికారం లేదన్నారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. మరి కేరళలో ఈ పరిస్థితి ఎటువైపునకు దారి తీస్తుందో చూడాలి.

Also read:

Andhra pradesh Govt: ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు.. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న రగడ..

urvashi rautela: విశ్వసుందరి కిరీటాన్ని గెలిచి ఐదేళ్లు పూర్తి.. సోషల్ మీడియాలో వీడియో.. హీట్ పెంచిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ..