PM Modi: జార్ఖండ్ పాలము ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జార్ఖండ్ పాలము నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని దేశ రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. బీజేపీ, జార్ఖండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

PM Modi: జార్ఖండ్ పాలము ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
Pm Modi
Follow us

|

Updated on: May 04, 2024 | 4:49 PM

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జార్ఖండ్ పాలము నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని దేశ రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. బీజేపీ, జార్ఖండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రజాల ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.

పాలమూలో సభలో ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరం అంశాన్ని లేవనెత్తారు. 500 ఏళ్లలో చేయని అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసి చూపించామన్నారు. ఇది దేశ ప్రజలు తమకు ఇచ్చిన అధికారంతోనే సాధ్యమైందని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2014లో ప్రజలు తిరస్కరించారన్నారు. రామమందిరం కోసం దాదాపు 500 ఏళ్లుగా అయోధ్యలో జరిగినంత సుదీర్ఘ పోరాటం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. దేశ ప్రజల మద్దతుతోనే ఆర్టికల్ 370 ని రద్దు చేసి జమ్మూ, కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పామన్నారు. .

కాంగ్రెస్, జేఎంఎం టార్గెట్ చేస్తూ..

కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క పైసా కుంభకోణం కూడా చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం ప్రజా ఆస్తులను దోచుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అధికార పార్టీ జేఎంఎం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జేఎంఎం, కాంగ్రెస్‌ నాయకులు అవినీతితో అపార సంపద సృష్టించారన్నారు. ఆస్తులైనా, రాజకీయాలైనా తమ బిడ్డల కోసం సంపాదిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తన జీవితం గురించి ప్రస్తావించారు. తాను పేదరికం నుంచి వచ్చిన నాయకుడినని, అందువల్లే ఈ 10ఏళ్ల పాటు పేదలకు సంక్షేమం అందేందుకు కృషి చేశానన్నారు. తన ప్రభుత్వంలోని పథకాలు పేదలకు అందాయని, లబ్ధిదారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల బాధలు చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. పేదరికాన్ని చూసిన వారికే ఈ కన్నీళ్లు అర్థమవుతాయి. జార్ఖండ్‌లో ఉపాధిని పెంచాలని, ఇక్కడి ప్రజల జీవితాల్లో ప్రగతి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. జార్ఖండ్ ప్రజల భూములను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, జేఎంఎంల కళ్లు కేవలం ప్రజా ఆస్తులపైనే ఉన్నాయని, వారికి మరేమీ కనిపించడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్