Priyanka Gandhi: రాహుల్‌గాంధీని యువరాజు అని విమర్శిస్తున్న బీజేపీకి ప్రియాంక కౌంటర్

రాహుల్‌గాంధీని యువరాజు అని విమర్శిస్తున్న ప్రధాని మోదీకి గట్టి కౌంటరిచ్చారు ప్రియాంకాగాంధీ. మోదీ షహెన్‌షా .. చక్రవర్తి లాంటివారని , ప్యాలెస్‌లో ఉంటూ ప్రజలను కలవడం లేదని విమర్శించారు. ఆమె ఏం కామెంట్స్ చేశారో తెలుసుకుందాం పదండి....

Priyanka Gandhi: రాహుల్‌గాంధీని యువరాజు అని విమర్శిస్తున్న బీజేపీకి ప్రియాంక కౌంటర్
Priyanka Gandhi Vadra
Follow us

|

Updated on: May 04, 2024 | 7:47 PM

లోక్‌సభ ఎన్నికల వేళ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ప్రతిసభలో రాహుల్‌గాంధీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు ప్రధాని మోదీ. రాహుల్‌ను ప్రతి సభలో షెహజాదా .. యువరాజు అని ప్రధాని మోదీ సంభోధించడాన్ని ప్రియాంకాంగాంధీ తప్పుపట్టారు. మోదీ షెహన్‌షా … చక్రవర్తి అంటూ కౌంటరిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందన్నారు . రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీని తరచుగా మోదీ యువరాజుగా పోలుస్తున్నారని , దేశ ప్రజల కోసం ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని… మోదీనే చక్రవర్తిగా పాలిస్తున్నారని కౌంటరిచ్చారు.

ఆదివాసీ ప్రాంతమైన బనాస్‌కాంతలో ప్రచారం చేశారు ప్రియాంక. చక్రవర్తి నరేంద్ర మోదీ రాజభవనాల్లో ఉంటారని, నిస్సహాయ రైతులు, మహిళల అవస్థలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతాయని ప్రశ్నించారు. మోదీ బడా వ్యక్తుల గురించే పట్టించుకుంటారు కానీ సామాన్య ప్రజానీకం గోడు ఆయనకు అక్కరలేదని ప్రియాంక విమర్శించారు. గుజరాత్ ప్రజలు మోదీని గౌరవించి ఆయనకు అధికారం కట్టబెట్టారని, కానీ ఆయన బడా వ్యక్తుల గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. మోదీ కనీసం ఒక్క రైతునైనా కలుసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? వారిని కలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎన్నికలు ముంచుకొచ్చి.. తమకు ఓట్లు రావని తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ చట్టాలను మారుస్తామంటున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని ప్రియాంక ఆరోపించారు.

‘ప్రజలకు రాజ్యాంగ హక్కులు ప్రసాదించిందని , అన్నింటికంటే పెద్ద హక్కు ఓటు హక్కు. రిజర్వేషన్‌ హక్కుతో పాటు ప్రశ్నించే హక్కు, ఆందోళన చేసే హక్కు దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించింది. అందువల్లే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా ప్రజల హక్కులను లాక్కోవడమే అవుతుందన్నారు ప్రియాంక.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Latest Articles
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో