Rohini Karthi 2023: రోహిణి కార్తీలో సూర్యుడు ఉగ్ర రూపం.. ఎండ వేడికి నివారణ చర్యలు.. చేయాల్సిన దానాలు మీకోసం

|

May 27, 2023 | 8:34 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... మొత్తం 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. మే 25న, అర్థరాత్రి సూర్యుడు చంద్రునికి ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు ఈ నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. ఈ సమయంలో చాలా వేడిగా ఉంటుంది. అందుకే జంతువులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Rohini Karthi 2023: రోహిణి కార్తీలో సూర్యుడు ఉగ్ర రూపం.. ఎండ వేడికి నివారణ చర్యలు.. చేయాల్సిన దానాలు మీకోసం
Rohini Karthi 2023
Follow us on

రోహిణి కార్తి మే 25 రాత్రి నుండి ప్రారంభమైంది.. ఇది జూన్ 9 వరకు ఉంటుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండ, వేడి , వడగాల్పులు ఉంటాయి. ఈ పక్షం రోజులు సూర్యుని వేడికి మనుషులు, జంతువులు, పక్షులు మాత్రమే కాదు మొక్కలు కూడా అల్లాడతాయి. రోహిణి కార్తీ సమయంలో సూర్యదేవుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడేమో అనిపించేలా ఎండ వేడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఎక్కువసేపు ఎండలో ఉంటే వారు అనారోగ్యానికి గురవుతారు. అన్నింటికంటే ఈ రోహిణి కార్తి సమయంలో సూర్య భగవానుడి వేడి భరించలేమనిపిస్తుంది. అయితే ఈ రోహిణి కార్తీ అనేది హిందూ మతపరమైన కోణం  నుంచి  మాత్రమే కాదు.. శాస్త్రీయ దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

ఈ సమయంలో సూర్యుడు భూమికి అతి చేరువలో ఉంటాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం ప్రారంభిస్తాయి.ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమిపై  ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి ఉంటుంది. ఈ రోహిణి కార్తితో మత విశ్వాసాలు,  సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… మొత్తం 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. మే 25న, అర్థరాత్రి సూర్యుడు చంద్రునికి ఇష్టమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు ఈ నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. ఈ సమయంలో చాలా వేడిగా ఉంటుంది. అందుకే జంతువులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

రోహిణి కార్తిలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే.. 

ఇవి కూడా చదవండి
  1. ఈ సమయంలో చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో కాలానుగుణమైన పండ్లు,  ఇతర వస్తువులను దానం చేసిన వ్యక్తి పుణ్యంతో పాటు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు.
  2. ఈ రోహిణి కార్తీలో సూర్యభగవానుడు రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది. అందుకే చల్లదనాన్ని ఇచ్చే వస్తువులను దానం చేయడం మంచిదని భావిస్తారు.
  3. పుచ్చకాయ, కర్భుజా , మామిడి వంటి సీజనల్ పండ్లను దానం చేయండి. అంతేకాదు దాహార్తిని తీర్చే విధంగా చల్లని నీరు, గోడలు, చెప్పులు, వంటివి దానం చేయడం చాలా మంచిది.
  4. మూగ జంతువులు, పక్షులకు ఈ పక్షం రోజులు త్రాగడానికి నీరు ఏర్పాట్లు చేయండి. జంతువులు, పక్షులు దాహం తీర్చుకునేలా వివిధ ప్రదేశాలలో పాత్రలలో నీటిని నింపండి.
  5. బాటసారులకు నీరు లేదా షర్బత్‌తో సహా వివిధ పానీయాలు ఇవ్వండి. ఈ సమయంలో నీటిని దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  6. మీరు దేవాలయానికి సమీపంలో నివసిస్తుంటే.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం నేలపై కార్పెట్ ఏర్పాటు చేయండి. అంతరం ఆ కార్పెట్ ను చల్లటి నీటితో తడిపి ఉంచండి. తద్వారా భక్తుల పాదాలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  7. ఈ సమయంలో చెట్లను, మొక్కలను సంరక్షించండి.. నీటిని ఏర్పాటు చేయండి.. అంతేకాదు కొత్త మొక్కలు మొలకెత్తడానికి విత్తనాలు నాటి.. వాటిని సంరక్షించండి. మరికొద్ది రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. దీంతో విత్తులు మొక్కలుగా మారి వర్ధిల్లుతాయి. దీంతో ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.
  8. బ్రహ్మదేవుని విగ్రహాన్ని తయారు చేసి పిండితో పూజించాలి. భగవంతుడు సంతోషించి ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).