AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: ఈ రాశి వారు ఈరోజు అప్పులు తీసుకోవడం, ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదు.. ఫిబ్రవరి 18 రాశి ఫలాలు..

Today Horoscope: ప్రతిరోజునూ ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో ప్రారంభిస్తుంటాం. మరి కొత్త రోజు మనకు ఎలాంటి అనుకూల వాతావరణం ఉంటుంది. ఏ రాశి వారు ఎలాంటి పనులు మొదలు పెడితే మంచిది...

Today Horoscope: ఈ రాశి వారు ఈరోజు అప్పులు తీసుకోవడం, ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదు.. ఫిబ్రవరి 18 రాశి ఫలాలు..
Narender Vaitla
|

Updated on: Feb 18, 2021 | 7:00 AM

Share

Today Horoscope: ప్రతిరోజునూ ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో ప్రారంభిస్తుంటాం. మరి కొత్త రోజు మనకు ఎలాంటి అనుకూల వాతావరణం ఉంటుంది. ఏ రాశి వారు ఎలాంటి పనులు మొదలు పెడితే మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తితో ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ రాశి ఫలాలు. మరి ఈ రోజు (ఫిబ్రవరి 18) ఏ రాశి వారి స్థితిగతులు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందామా..?

మేష రాశి:

ఈ రాశివారికి ఈరోజు ఉద్యోగ అంశాల్లో సానుకూలత కనిపిస్తోంది. వచ్చిన అవకాశాలను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ‘శ్రీ రాజమాతంగీ నమః’ అనే నామజపం చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలున్నాయి. ‘కార్తివ్యార్జున’ నామ స్మరణ ఈ రాశుల వారికి మరింత మేలు చేస్తుంది.

మిథున రాశి:

ఈ రాశువారు ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ రాశి వారికి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తతో ఉంటే మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం, విష్ణు పూజ మేలు చేస్తుంది.

సింహ రాశి:

ఈ రాశి వారు చేపట్టే పనులు కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈ రాశి వారికి ఈరోజు గణపతి నామస్మరణ మేలు చేస్తుంది.

కన్య రాశి:

కన్య రాశి వారికి కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. అలాగే ఆలోచన సంబంధిత అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. సుబ్రమణ్య స్వామి ఆరాదన వీరికి మేలు చేస్తుంది.

తుల రాశి:

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా మెరుగవుతుంటాయి. స్నేహితుల సహాకారం లభిస్తుంది. తెల్లని పుష్పాలతో పరమేశ్వరుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకోని అవాంతరాలు ఎదురైనప్పటికీ.. దేవుడ అనుగ్రహంతో వాటిని సమర్థవంతంగా అధిరోహించగలుగుతారు. ఈ రాశి వారికి హనుమాన్‌ చాలీసా పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారు పనులు చేపట్టే విషయంలో ముందు వెనక ఆలోచించడం, ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడం మంచిది. ఈరోజు కీలకమైన వ్యక్తులను కలుస్తారు. మహాలక్ష్మి అమ్మవారికి చక్కెర పొంగలి నివేధించడం మంచిది.

మకర రాశి:

మకర రాశి వారికి ఈరోజు పరిచయాలు విస్తృతమవుతుంటాయి. ఆహార, విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ధ్యానం చేసుకోవడం, ఇష్ట దేవతారాధణ చేసుకోవడం ఈ రాశుల వారికి మంచి చేస్తుంది.

కుంభ రాశి:

ఈ రాశి వారి ఈరోజు ఆర్థిక వ్యవహారిక అంశాలు కొంత నిరాశ కలిగిస్తాయి, శ్రమ తప్పకపోవచ్చు. దుర్గ సప్త శ్లోక పరాయణం ఈ రాశి వారికి సూచించతగ్గ అంశం.

మీన రాశి:

మీన రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు ఆలస్యమవుతాయి. ఆర్థిక లోటుపాట్లను సవరణ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సమాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పేదప్రజలకు ఆహార, పానియాలు దానం చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.

Also Read: Significance of Owl: హిందూ ధర్మ శాస్త్రంలో గుడ్లగూబకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసా ..!

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!