Ayodhya: అయోధ్యలోని హనుమాన్‌గర్హి హనుమాన్ దేవాలయం గురించి మీకు తెలుసా..? దీని వెనక పెద్ద కథే ఉంది!
అయోధ్యను రామనగరి అని కూడా పిలుస్తుంటారు. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠతో రామాలయంలో శ్రీరాముడి జీవితం పవిత్రం కానుంది . అయితే రాముని పరమ భక్తుడైన హనుమాన్ దేవాలయం హనుమాన్‌గర్హి కూడా అయోధ్యలోనే ఉందని మీకు తెలుసా. ఈ దేవాలయానికి కూడా ప్రత్యేక చరిత్రే ఉంది.

ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అత్యద్భుత నిర్మాణ శైలితో..అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి..రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆలయ ట్రస్ట్ దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.
అయోధ్యను రామనగరి అని కూడా పిలుస్తుంటారు. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠతో రామాలయంలో శ్రీరాముడి జీవితం పవిత్రం కానుంది . అయితే రాముని పరమ భక్తుడైన హనుమాన్ దేవాలయం హనుమాన్‌గర్హి కూడా అయోధ్యలోనే ఉందని మీకు తెలుసా. ఈ దేవాలయానికి కూడా ప్రత్యేక చరిత్రే ఉంది.
అయోధ్యలో ఉన్న హనుమాన్‌గర్హి ఆలయానికి సంబంధించి, దానిని సందర్శించకుండా, రాంలాలా దర్శనం అసంపూర్ణంగా భావిస్తుంటారు. రాముడు తన ప్రియమైన భక్తుడు హనుమంతునికి లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత నివసించడానికి ఇచ్చిన ఆలయం ఇదే అని చెబుతారు. అందుకే అయోధ్యకు వచ్చే ముందు హనుమాన్‌గర్హిలో ఉన్న హనుమంతుని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఎందుకంటే రామ్ జీ ఈ ఆలయాన్ని హనుమాన్ జీకి ఇచ్చినప్పుడు, ఎవరైనా భక్తుడు అయోధ్యకు వచ్చినప్పుడు, అతను మొదట హనుమాన్ దర్శనం చేసుకుంటారు. ఈ విషయం మన అథర్వవేదంలో వివరించడం జరిగింది.
ఈ ఆలయం అయోధ్య నగరం మధ్యలో ఉంది. ఇక్కడ హనుమంతుడు నిత్యం ఉంటాడని నమ్ముతారు భక్తులు. హనుమాన్ జీ ఈ ఆలయం రాజ ద్వారం ముందు ఎత్తైన గుట్టపై ఉంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయంలో ఎవరైనా భక్తుడు హనుమంతునికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తే, అతను అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రధాన ఆలయంలో బాల్ హనుమంతునితో పాటు అంజనీ మాత విగ్రహం ఉంది. లంక నుండి విజయం సాధించిన తర్వాత తెచ్చిన జ్ఞాపికలను ఈ ఆలయంలోనే భద్రపరిచారట.
ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన ‘హనుమాన్ నిషాన్’ ఉంది. ఇది నాలుగు మీటర్ల వెడల్పు, ఎనిమిది మీటర్ల పొడవు గల జెండా. భక్తుల నమ్మకం ప్రకారం, ప్రతి పూజకు ముందు, హనుమాన్ నిషాన్ రామజన్మభూమి ప్రదేశానికి తీసుకువెళతారు. అక్కడ ముందుగా పూజిస్తారు. 200 మంది కలిసి ఈ గుర్తును రామజన్మభూమికి తీసుకువెళ్తారు. హనుమంతుని దర్శనం కోసం భక్తులు 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ దేవాలయం అన్ని గోడలపై హనుమాన్ చాలీసా, చౌపయ్యలు వ్రాయబడ్డాయి.
ఇక ఇదిలావుంటే, రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య రూపు రేఖలే మారిపోనున్నాయి. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లబోతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…