ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. పిలిస్తే పలికే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు.. ఒక సజీవ సత్యం. అయితే ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి.. ఆధ్యాత్మిక చరిత్రలో రామకృష్ణ పరమహంసగా నిలిచిన మహనీయుడు. ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి.. నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా హిందూ సనాతన ధర్మానికి అందించిన మహాప్రవక్త రామకృష్ణపరమహంస జయంతి నేడు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, సాధువు , హిందూ మత గురువు రామకృష్ణ పరమహంస సంక్లిష్టమైన ఆధ్యాత్మిక బోధనలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళీకరించారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. రామకృష్ణపరమహంస జన్మదినం ప్రతి ఏడాది జరుపుతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రామకృష్ణ పరమహంస 187వ జయంతి ఫిబ్రవరి 21న నిర్వహించబడుతుంది.
రామకృష్ణ పశ్చిమ బెంగాల్‌లోని కమర్పుకూర్‌లో 1836 ఫిబ్రవరి18న కుదీరా, చంద్రమణి దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఈయనకు గదాధర్ ఛటోపాధ్యాయ నామకరణం చేసారు. అయితే రామకృష్ణ తల్లిదండ్రులు తమ కుమారుడు ఏదో ఒకరోజు ఆధ్యాత్మిక గురువుగా ఎదుగుతాడని ముందే గుర్తించారు.
విద్యార్థులకు ఆధ్యాత్మిక అభ్యాసాలు, జీవితంలో చదువు ప్రాముఖ్యత గురించి తక్కువ లేదా ఏమీ బోధించకుండానే ఈ ప్రపంచంలో లాభాలు పొందడం.. తమను తాము ఎలా నిలబెట్టుకోవాలో విద్యార్థులకు నేర్పడానికి విద్యా విధానం రూపొందించబడిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రామాయణం, మహాభారతం, భాగవత పురాణం వంటి మత గ్రంథాలలో బాగా ప్రావీణ్యం సంపాదించారు. రామకృష్ణ పరమహంస కాళీ దేవి గొప్ప భక్తుడు. పశ్చిమ బెంగాల్‌లో హిందూ మతం పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు
రామకృష్ణ పరమహంస స్ఫూర్తిదాయకమైన కోట్స్
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)