Vaishno Devi: వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నారా.. మీ కోసం ఈ ప్రత్యేక వెసులుబాటు.. ఆ రూట్ లో ప్రయోగాత్మక అమలు

|

Aug 22, 2022 | 7:50 AM

హిమ పర్వత సానువుల్లో ప్రకృతి రమణీయత మధ్య ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న ప్రపంచ ప్రఖ్యాత వైష్ణో దేవి (Vaishno Devi Temple) ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో..

Vaishno Devi: వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నారా.. మీ కోసం ఈ ప్రత్యేక వెసులుబాటు.. ఆ రూట్ లో ప్రయోగాత్మక అమలు
Vaishno Devi Temple
Follow us on

హిమ పర్వత సానువుల్లో ప్రకృతి రమణీయత మధ్య ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న ప్రపంచ ప్రఖ్యాత వైష్ణో దేవి (Vaishno Devi Temple) ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వైష్ణోదేవి మందిరం సుసంపన్న దేవాలయాల జాబితాలోనూ స్థానం దక్కించుకుంది. రోజురోజుకు ఈ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు నూతన విధానాన్ని తీసుకువచ్చారు. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు కార్డులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. వైర్‌లెస్ టెక్నాలజీతో రేడియో తరంగాల ద్వారా ఈ కార్డులను ట్రాక్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్డులపై ఎన్‌క్రిప్టెడ్ సమాచారంతో పాటు సీరియల్‌ నంబర్లు ఉంటాయి. కాగా.. బాల్‌గంగా, తారాకోట్ నుంచి వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా రియల్ టైంలో భక్తుల కదలికలను ట్రాక్‌ చేయొచ్చని వివరించారు. ఫలితంగా ఆలయంలో సామర్థ్యానికి మించి భక్తుల రద్దీ ఏర్పడితే సందర్శకులను నియంత్రించడం సులభతరమవుతుందని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠానికి అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. కొన్ని గ్రంధాలు మాత్రం ఇక్కడ అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపంలోని కొన్ని శిల్పాలు లభ్యం కావడం ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పంను అమ్మవారి వరద హస్తంగా భక్తులు గౌరవిస్తారు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..