Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే వాహనాలు వన్ వే ద్వారా దారి మల్లింపు.. నిబంధనలు పాటించాలని సూచించిన పోలీసులు..

|

Feb 15, 2022 | 8:58 AM

ట్రాఫిక్‌ జామ్స్‌ లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో మేడారం రూట్‌ను వన్‌వేగా మార్చారు పోలీసులు.

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లే వాహనాలు వన్ వే ద్వారా దారి మల్లింపు.. నిబంధనలు పాటించాలని సూచించిన పోలీసులు..
Medaram Jatara Traffic
Follow us on

One Way Rules: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర ఇప్పటికే భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర (Medaram jatara) జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. ట్రాఫిక్‌(traffic)ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోయేదారి.. వచ్చేదారి అంటూ వన్‌వే చేశారు. మేడారం జనసంద్రంగా మారింది. సమ్మక్క, సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్‌ జామ్స్‌ లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో మేడారం రూట్‌ను వన్‌వేగా మార్చారు పోలీసులు.

తాడ్వాయి నుంచి మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వెహికల్స్‌కి మాత్రమే అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌, హన్మకొండ నుంచి వాహనాలను పస్రా మీదుగా తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కాళేశ్వరం, కరీంనగర్‌ నుంచి వాహనాలను కాల్వపల్లి మీదుగా మేడారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

అన్ని దారులు జన జాతర వైపే..

ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట
ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్‌ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్‌ నుంచి పోవాల్సి ఉంటుంది. వీరి కోసం పార్కింగ్‌‌ను వెంగ్లాపూర్, నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్, కరీంనగర్‌, నిజామాబాద్‌

హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్‌ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్‌ చేరుకుంటారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే భక్తుల కోసం నార్లాపూర్, కొత్తూరు వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

లింగాల, గుండాల..

ఇల్లెందు, రొంపేడు, గంగారం, పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్‌ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే అమ్మవారి భక్తుల కోసం వెంగ్లాపూర్‌
పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

రామగుండం, మంథని..

రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారెపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌లోనే వెళ్లాలి.
పార్కింగ్‌ : కాల్వపల్లి, నార్లాపూర్‌

కాళేశ్వరం, మహారాష్ట్ర..

కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్‌ చేరుకోవాలి. ఇటుగా వచ్చేవారి కోసం
ఊరట్టం సమీపంలో పార్కింగ్‌  ఏర్పాటు చేశారు.

వాజేడు, ఛత్తీస్‌గఢ్‌ వెంకటాపురం(కె)

ఇక ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వీరి కోసం ఊరట్టంలో పార్కింగ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం

కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్‌లో ఏదైనా ట్రాఫిక్‌ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ పార్కింగ్‌ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను ఊరట్టం వద్ద పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..

Skin Care Tips: బాదం నూనె ఉపయోగిస్తే నిత్య యవ్వనం.. ముడుతలు లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!