Pitru Paksha 2024: పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 5 పనులు చేయవద్దు.. ఇలా చేస్తే పూర్వీకులు ఆగ్రహిస్తారు..

|

Sep 11, 2024 | 12:00 PM

ఈ సంవత్సరం 2024లో పితృ పక్షం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తులు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు, కర్మలను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని వారి ఆశీస్సులతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం.

Pitru Paksha 2024: పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 5 పనులు చేయవద్దు.. ఇలా చేస్తే పూర్వీకులు ఆగ్రహిస్తారు..
Pitru Paksha 2024
Follow us on

హిందూ మతంలో పితృ పక్షం పూర్వీకులను స్మరించుకోవడానికి, నివాళి అర్పించడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఈ కాలంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని ప్రత్యేక నియమాలు, సంప్రదాయాలు పాటిస్తారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని వారి ఆశీస్సులతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం.

ఈ సంవత్సరం 2024లో పితృ పక్షం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తులు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు, కర్మలను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.

మాంసాహారం, మద్యపానం

పితృ పక్షం సమయంలో మాంసాహారం, మద్యం తీసుకోవడం నిషేధించబడింది. వీటిని సేవించడం వల్ల పూర్వీకులకు బాధ కలుగుతుందని.. వారి ఆగ్రహానికి గురవుతారని నమ్ముతారు. అంతేకాదు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎరుపు బట్టలు

పితృ పక్షం సమయంలో ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది.

అబద్ధం చెప్పడం

పితృ పక్షంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి సత్యాన్ని మాట్లాడటం ఉత్తమ మార్గం.

కోపం,హింస

పితృ పక్షంలో కోపం, హింసకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి అందరితో ప్రేమగా మెలగాలి.

అనైతిక చర్య

పితృ పక్షం సమయంలో ఎలాంటి అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. ఇది పూర్వీకులను అవమానించినట్లుగా భావిస్తారు.

పూర్వీకులను సంతోషపెట్టే మార్గాలు

  1. పితృ పక్షంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది జీవితంలో ఆనందం, శ్రేయస్సును పొందుతారు.
  2. పితృ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేయడం చాలా ముఖ్యం. పిండ ప్రదానంలో పూర్వీకులకు ఆహారం, నీరు, దక్షిణ ఇస్తారు.
  3. తర్పణంలో పూర్వీకులకు నీళ్ళు సమర్పిస్తారు.
  4. పిండ ప్రదానంలో పిండదానాన్ని పూర్వీకులకు సమర్పిస్తారు.
  5. పితృ పక్షం సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
  6. పూర్వీకుల నామాలను జపించడం కూడా శుభప్రదం.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పితృ పక్షం సమయంలో మీ పూర్వీకులను స్మరించుకోండి. వారి పట్ల గౌరవాన్ని తెలియజేయండి. పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో విజయం సాధిస్తారు. పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదం అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు, తర్పణం, శ్రాద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని చేకూర్చి, కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగిస్తాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి