Tirumala: శ్రీవారి ఆలయంలో రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పన పై అధికారుల దృష్టి

|

Apr 19, 2022 | 7:58 AM

Tirumala: తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో కూడా రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని టీటీడీ ఈవో..

Tirumala: శ్రీవారి ఆలయంలో రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పన పై అధికారుల దృష్టి
Tirumala Tirupati
Follow us on

Tirumala: తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో కూడా రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని టీటీడీ ఈవో  కెఎస్ జవహర్ రెడ్డి (EO Jawahar Reddy)ఆదేశించారు. టీటీడీ ఆలయాల్లో భక్తుల రద్దీ నిర్వహణ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సోమవారం రాత్రి ఈవో అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి ముగిసే వరకు ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

తిరుమలలో టోకెన్ లేకుండా సర్వదర్శనం అమలు చేస్తున్నందువల్ల క్యూ లైన్లు, షెడ్లు, క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లను  ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విభాగాది పతులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని అన్నారు.
స్థానిక ఆలయాల్లో సైతం భక్తులు ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ఆలయాల్లో తాగునీరు, నీడ ఉండాలని ఈవో చెప్పారు.

కోవిడ్ కు ముందు ఎక్కడ ఎంత మంది ఉద్యోగులు పని చేసేవారో తెలుసుకుని, అవసరమైన చోట వెంటనే ఉద్యోగుల ను రప్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతా విభాగం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జేఈవో శ్రీ వీర బ్రహ్మం, సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ ఏసిఏ ఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, విజిఓ శ్రీమనోహర్ తో పాటు ఆయా విభాగాల డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.
Also Read:   తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భానుడు భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి