Zodiac Signs: ఈ మూడు రాశుల వారు దూకుడుగా ఉంటారు..! కొన్ని కారణాల వల్ల..?

| Edited By: Anil kumar poka

Nov 15, 2021 | 1:10 PM

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ రాశి చక్రం మీ వ్యక్తిత్వం గురించి మీకు తెలియని అనేక విషయాలను తెలియజేస్తుంది. మీలో దాగివున్న గుణాలు, లోపాలను

Zodiac Signs: ఈ మూడు రాశుల వారు దూకుడుగా ఉంటారు..! కొన్ని కారణాల వల్ల..?
Zodiac Signs
Follow us on

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ రాశి చక్రం మీ వ్యక్తిత్వం గురించి మీకు తెలియని అనేక విషయాలను తెలియజేస్తుంది. మీలో దాగివున్న గుణాలు, లోపాలను వెల్లడిస్తుంది. మీకు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే ప్రతి విషయం తెలుసుకోవచ్చు. సాధారణంగా రాశులన్నింటిలో ఈ మూడు రాశుల వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. ఈ వ్యక్తుల గురించి పెద్దగా తెలియదు కానీ వారి పరిచయం మీకు చాలా పాఠాలను నేర్పుతుంది. కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు. ఈ రాశులవారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. అనవసరమైన తగాదాలను ఎంచుకొని చాలా కాలం పాటు వార్తల్లో నిలుస్తారు. అలాంటి వ్యక్తులను ఎవ్వరూ ఇష్టపడరు కానీ వారితో స్నేహం జీవితంలో మరువలేరు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ 3 రాశుల గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. తులారాశి
తులా రాశి వ్యక్తులు కొన్నిసార్లు చాలా దూకుడుగా ఉంటారు. కోపంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడాలని అనుకోవడం గొడవలకు దారి తీస్తుంది. అందుకే కొన్ని సందర్భాలలో వారికి దూరంగా ఉండటం మంచిది. ఏదైనా విషయంలో గొడవ పడితే దానికోసం ఎంతదూరమైనా వెళుతారు. అది చిన్నవిషయామా.. పెద్దవిషయమా అనేది తేడా వీరికి తెలియదు.

2. మిధునరాశి
మిథున రాశి వ్యక్తులు అధిక కోపాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని విషయాలు వారికి నచ్చిన విధంగా జరగనప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తారు. తనకు తెలియకుండా ఎందుకు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. తమ ఆధిపత్యాన్ని, సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అందుకోసం తరచూ దూకుడుగా ప్రవర్తిస్తారు. వీరకి దూరంగా ఉండటం మంచిది.

3. మేషరాశి
మేష రాశి వారు మంచి మనసు కలవారు. అయితే అన్యాయాన్ని సహించలేరు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు చెడ్డ పరిస్థితిలో ఉన్నప్పుడు వీరు దూకుడుగా వ్యవహరిస్తారు. వీరివల్ల ఒక్కోసారి మంచి జరుగవచ్చు మరోసారి చెడు జరగవచ్చు. వీరి దూకుడు ప్రవర్తన కారణంగా చాలాసార్లు అనుకోని గొడవలలో ఇరుక్కుంటారు. వీరి దూకుడే వీరికి విరోధి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గమనించండి..

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..