Bhogi: రేపు పుష్య పౌర్ణమి.. అరుదైన యోగం.. ఈ 5 ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే డబ్బుకు లోటు ఉండదు

|

Jan 12, 2025 | 4:16 PM

ఈ ఏడాది భోగి పండగ అరుదైన శుభ యోగంలో వచ్చింది. 110 ఏళ్ల తర్వాత పుష్య మాసం పౌర్ణమి తిధి, సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. అంతేకాదు ఈ పౌర్ణమి క్ల పక్షం చివరి తిధి. ఈ రోజున నదీ స్నానం చేయడమే కాదు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యం. పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం కలుగుతుందని మత విశ్వాసం.

Bhogi: రేపు పుష్య పౌర్ణమి.. అరుదైన యోగం.. ఈ 5 ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే డబ్బుకు లోటు ఉండదు
Pushya Pournami 2025
Follow us on

పుష్య మాసం పౌర్ణమి రోజున హిందు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయి. పుష్య మాసం పూర్ణిమ నాడు ఏయే ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం..

ఇంట్లో ఆనందం, శాంతి: పుష్య పూర్ణిమ రోజున పూజ సమయంలో పూజ గదిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి సుఖశాంతులు ఇవ్వమని కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయని మత విశ్వాసం. అలాగే ఇంట్లో సానుకూలత నెలకొంటుంది.

ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి: తులసి మొక్క హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మిదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. పుష్య పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పండ్లు, స్వీట్లను సమర్పించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి.

ఇవి కూడా చదవండి

రావి చెట్టు దగ్గర దీపం: మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివుడు రావి చెట్టులో నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో పుష్య పూర్ణిమ రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకులు కూడా సంతోషిస్తారు.

అన్ని కష్టాలు తొలగిపోతాయి: అంతే కాదు పౌష పూర్ణిమ రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యి దీపం వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

పాపాల నుంచి విముక్తి లభిస్తుంది: ఈ రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి, దీపదానం చేయండి. దీపదానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొంది కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

పుష్య పౌర్ణమి రోజున చేయాల్సిన దానాలు

హిందూ మతంలో పౌర్ణమి అయినా, అమావాస్య అయినా ఏదైనా పవిత్రమైన రోజులో దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పుష్య పూర్ణిమ రోజున ఆహారం, డబ్బు, బట్టలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని, వ్యాపారంలో లాభం ఉంటుందని మత విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.