Parivartini Ekadashi: ఈరోజు పరివర్తిని ఏకాదశి.. పూజా విధానం, ఏ దానం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయంటే

|

Sep 14, 2024 | 6:39 AM

యోగ నిద్రలో ఉన్న విష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక.. దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. అందుకే ఈ తిధిన విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనిషికి చేసిన పాపాలు నశిస్తాయి అని చెబుతారు. అలాగే పరివర్తినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ హరి మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. అందువల్ల, ఏకాదశిని పూజించడం విశేషంగా పరిగణించబడుతుంది.

Parivartini Ekadashi: ఈరోజు పరివర్తిని ఏకాదశి.. పూజా విధానం, ఏ దానం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయంటే
Parivartini Ekadashi
Follow us on

పరివర్తిని ఏకాదశికి హిందూ మతంలో ముఖ్యమైన స్థానం ఉంది. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం యోగ నిద్రలో ఉన్న విష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక.. దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. అందుకే ఈ తిధిన విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనిషికి చేసిన పాపాలు నశిస్తాయి అని చెబుతారు. అలాగే పరివర్తినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ హరి మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. అందువల్ల, ఏకాదశిని పూజించడం విశేషంగా పరిగణించబడుతుంది.

పరివర్తిని ఏకాదశి 2024 శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం పరివర్తిని ఏకాదశి రోజున సాయంత్రం 6.18 గంటల వరకు శోభన యోగం ఉంటుంది. దీంతో పాటు సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి 8:32 గంటల నుంచి ఉదయం 06:06 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం, ఉదయం 06:06 నుంచి 08:32 గంటల వరకు రవియోగం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 వరకు ఉంటుంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది. ఇవన్నీ పూజకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సముయంలో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది పరివర్తిని ఏకాదశి వ్రతం 14 సెప్టెంబర్ 2024 శనివారం రోజున ఆచరించబడుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమిస్తారు.

పరివర్తిని ఏకాదశి 2024 మహత్వం

పరివర్తినీ ఏకాదశిని జల్ఝులని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున మహావిష్ణువును ధ్యానించడం, పూజించడం వల్ల సర్వపాపాలనుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

పరివర్తిని ఏకాదశి 2024 పూజ విధి

పరివర్తినీ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రమైన ప్రదేశంలో ప్రతిష్టించండి. విష్ణువు నాలుగు చేతులలో శంఖం, చక్రం, గద, పద్మాన్ని ఉంచండి. తరువాత విష్ణువు ముందు నెయ్యి దీపం, ధూపం వెలిగించండి. దేవుడికి పండ్లు, పూలు, స్వీట్లు సమర్పించండి. ఓం నమో నారాయణాయ నమః, ఓం విష్ణవే నమః వంటి విష్ణు మంత్రాలను జపించండి. పరివర్తినీ ఏకాదశి కథను కూడా వినండి. విష్ణువుకి హారతి ఇచ్చి పూజను ముగించండి. ఏకాదశి రోజున ఉపవాసం విరమించిన తరువాత ద్వాదశి తిథి రోజున ఆహారం తీసుకోవాలి. బ్రాహ్మణులకు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

విష్ణుసహస్రనామం జపించండి

ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

తులసిని పూజించండి

తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసిని పూజించడం వల్ల సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

పేదలకు దానం చేయండి

ఈ రోజున పేదలకు అన్న వితరణ, బట్టలు లేదా డబ్బు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. కావున ప్రతి ఏకాదశి రోజున దీన్ని తప్పక చేయాలి.

విష్ణువు విగ్రహానికి స్నానం చేయడం

ఈ రోజున శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతంతో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి